మారుతి సుజుకి ఎర్టిగా 7 సీట్ల కారు. ఇది లీటరుకు 20.51 కి.మీ మరియు కిలోకు 26.11 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ప్యాడిల్ షిఫ్టర్లు, ఆటో హెడ్‌లైట్లు, ఆటో AC, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (CSD) కు భారతదేశంలో అహ్మదాబాద్, బాగ్డోగ్రా, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో 34 CSD గిడ్డంగులు ఉన్నాయి. ఇది, సైనిక సిబ్బందికి ఆహారం, వైద్య సామాగ్రి, గృహోపకరణాలు, కార్లు వంటివి తక్కువ ధరకు అందిస్తుంది. CSDలో కారు కొనడానికి భారత సైన్యంలో పనిచేస్తున్న, పదవీ విరమణ పొందిన సైనిక సిబ్బంది, సైనిక సిబ్బంది వితంతువులు, మాజీ సైనికులు, రక్షణ శాఖ ఉద్యోగులు అర్హులు.