భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సియాజ్ సెడాన్ అమ్మకాలు ఆగిపోయాయి. ఈ కారు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మార్కెట్ అవసరాలు, వినియోగదారుల అభిప్రాయం ఆధారంగా మా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటామని మారుతి సుజుకి మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ అన్నారు.