తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్‌తో మంచి బైక్ కొనాలనుకుంటున్నారా..? అయితే కేవలం లక్ష రూపాయల లోపు ధరలో లభించే బైక్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి... ఇందులో బెస్ట్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
లక్షలోపు బడ్జెట్‌లో బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ బైక్స్...
ఓ సామాన్యుడు కొత్త బైక్ కొనడానికి షోరూమ్‌కి వెళ్తే అడిగే మొదటి ప్రశ్న 'ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది?'. పెరుగుతున్న ధరలు, పెట్రోల్ ఖర్చుల మధ్య బైక్ మెయింటెనెన్స్ అనేది కాస్ట్లీగా మారిపోయింది... అయినా వీటి వినియోగం తగ్గడంలేదు. తాజా గణాంకాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారత టూ-వీలర్ మార్కెట్ 8 నుంచి 9% వృద్ధి చెందనుంది. ఈ పెరుగుదలలో ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైక్‌ల వాటానే ఎక్కువట. మరి తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో లభించే బెస్ట్ బైక్స్ ఏవో చూద్దాం.
27
హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus)
తక్కువ ధర బైక్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు హీరో స్ప్లెండర్. ఇది 97.2cc ఇంజిన్‌తో వస్తుంది. దీనిపై జనాలకు అపారమైన నమ్మకం ఉంది.
ధర : దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.75,600 నుంచి రూ.85,000 వరకు ఉంటుంది.
మైలేజ్ : వాస్తవ పరిస్థితుల్లో ఈ బైక్ లీటర్‌కు 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
మెయింటెనెన్స్ : దీని వార్షిక నిర్వహణ ఖర్చు కేవలం రూ.6,500 నుంచి రూ.8,500 మధ్యే ఉంటుంది. దీని స్పేర్ పార్టులు దేశంలో ఎక్కడైనా సులభంగా దొరుకుతాయి.
37
బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)
ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవారికి, ముఖ్యంగా రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో తిరిగేవారికి ప్లాటినా ఒక బెస్ట్ ఆప్షన్.
ధర : దీని ధర రూ.65,000 నుంచి రూ.78,000 మధ్య ఉంటుంది.
మైలేజ్ : రైడర్ బరువు, రోడ్డును బట్టి ఈ బైక్ లీటర్‌కు 70 నుంచి 85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ప్రత్యేకత : దీనిలోని 'కంఫర్ట్‌టెక్' (ComforTec) టెక్నాలజీ, పొడవైన సస్పెన్షన్ వల్ల గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అలసట అస్సలు ఉండదు.
చాలా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ బైక్ కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఇది భారతదేశంలో అత్యంత చవకైన కొత్త బైక్‌లలో ఒకటి.
ధర : దీని ధర సుమారు రూ.58,600 నుంచి రూ.72,000 మధ్య ఉంటుంది.
మైలేజ్ : ఇందులో స్ప్లెండర్‌లో వాడిన 97.2cc ఇంజిన్‌నే ఉపయోగించారు. ఇది సులభంగా 70-75 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
మెయింటెనెన్స్ : స్ప్లెండర్ ఇంజిన్ ఉండటం వల్ల దీని స్పేర్ పార్టులు ఎక్కడైనా దొరుకుతాయి. చిన్న చిన్న పల్లెటూళ్లలోని మెకానిక్‌లు కూడా దీన్ని ఈజీగా రిపేర్ చేస్తారు.
57
టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
తక్కువ బడ్జెట్‌లో ధృడమైన, పొదుపైన బైక్‌గా టీవీఎస్ స్పోర్ట్‌కు మంచి పేరుంది.
ధర : దీని ధర సుమారు రూ.59,900 నుంచి రూ.69,800 మధ్య ఉంటుంది.
మైలేజ్ : దీని 109.7cc ఇంజిన్ వాస్తవ పరిస్థితుల్లో 65-70 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
ప్రత్యేకత : తక్కువ బరువు, అందుబాటు ధర కారణంగా సిటీ ట్రాఫిక్‌లో నడపడానికి, మొదటిసారి బైక్ కొనేవారికి ఇది ఒక అద్భుతమైన ప్యాకేజ్.
67
హోండా షైన్ 100 (Honda Shine 100)
హోండా బైక్‌లు వాటి ఇంజిన్ క్వాలిటీ, రిఫైన్‌మెంట్‌కు ప్రసిద్ధి. షైన్ 100 కూడా అవే ఫీచర్లతో ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టింది.
ధర : ఈ బైక్ ధర సుమారు రూ.65,700 నుంచి రూ.74,000 మధ్య ఉంటుంది.
మైలేజ్ : దీని 98.98cc ఇంజిన్ సులభంగా 65-70 కి.మీ. మైలేజ్ అందిస్తుంది.
ప్రత్యేకత : దీని సైలెంట్ స్టార్టర్ మోటార్, స్మూత్ పవర్ డెలివరీ వల్ల రోజువారీ ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
77
కొత్త బైక్ కొనే ముందు ఈ విషయాలు గమనించండి..
కొత్త బైక్‌ను ఎప్పుడూ మీ వ్యక్తిగత అవసరాలు, రోజువారీ ప్రయాణాన్ని బట్టి ఎంచుకోవాలి. మీకు తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ రీసేల్ వ్యాల్యూ కావాలంటే హీరో స్ప్లెండర్ ప్లస్ లేదా హెచ్ఎఫ్ డీలక్స్ బెస్ట్ ఆప్షన్లు. గతుకుల రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణం కోసం బజాజ్ ప్లాటినా సరైనది. ఇక స్మూత్ రైడింగ్ అనుభవం కోసం హోండా షైన్ 100 మంచి పెట్టుబడి. గుర్తుంచుకోండి, మీరు ఏ బైక్ ఎంచుకున్నా, దానికి సరైన సమయంలో సర్వీసింగ్ చేయిస్తేనే ఉత్తమ మైలేజ్ వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ వంటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి.