మేడ్ ఇన్ ఇండియా ఎస్‌యూవీ జీప్ రాంగ్లర్ 2021 వచ్చేసింది.. ధర, ఫీచర్స్, ప్రత్యేకతలు మీకోసం..

First Published Mar 17, 2021, 4:55 PM IST

అమెరికన్ ఆటోమోబైల్ బ్రాండ్ జీప్ బుధవారం మేడ్-ఇన్-ఇండియా రాంగ్లర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కొత్త కారును పాత మోడల్ కంటే చాలా తక్కువ ధరకే తీసుకొచ్చారు. కొత్త జీప్ రాంగ్లర్ 2021 ను అన్‌లిమిటెడ్, రూబికాన్ ట్రిమ్ అనే రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. 

ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంది. జీప్ సంస్థ మార్చి 15న జీప్ రాంగ్లర్ ఎస్‌యూవీని లాంచ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల నేడు లాంచ్ చేశారు అలాగే డెలివరీలు కూడా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
undefined
జీప్ రాంగ్లర్ ఎస్‌యూ‌వి ఎస్కెడి రౌట్ ద్వారా భారతదేశంలో స్థానికంగా తయారుచేసిన మొట్టమొదటి జీప్ మోడల్. దీనితో పాటు కంపెనీ ఇండియాలో ఫోల్క్ భాగాలతో జిప్ కంపాస్ ఎస్‌యూవీలను కూడా తయారు చేస్తుంది. జిప్ రాంగ్లర్ ఎస్‌యూవీ తరువాత గ్రాండ్ చెరోకీ 2022 ఎస్‌యూవీని కూడా స్థానికంగా అసెంబల్ చేయాలని యోచిస్తుంది.
undefined
ఇంజన్భారతదేశంలో అసెంబుల్ చేసిన కొత్త జీప్ రాంగ్లర్ ఎస్‌యూ‌వి 5-డోర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. దీనికి పాత మోడల్ లాగానే 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 262 హెచ్‌పి శక్తిని, 400 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా వస్తుంది.
undefined
ఫీచర్స్ఈ మోడల్ లో చాలా ఫీచర్లు పాతమోడల్ లో ఉన్న విధంగానే ఉంటాయి. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, లెదర్ అప్హోల్స్టరీ, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 7.0-ఇంచ్ కలర్ ఎంఐడి స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రాంగ్లర్ ఎస్‌యూవీ కావడంతో రిమువబుల్ డోర్స్, హార్డ్ టాప్ పైకప్పు ఉంటుంది.
undefined
భద్రతా ఫీచర్లుజీప్ రాంగ్లర్ లో ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, టైర్ ప్రెజర్ మానిటర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా స్టాండర్డ్ సేఫ్టీ పరంగా అందిస్తుంది.
undefined
ధరభారతదేశంలో కొత్త జీప్ రాంగ్లర్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర 53.90 లక్షలు నుండి రూ .57.9 లక్షలు వరకు ఉంటుంది. ఈ ధర పాత మోడల్ కంటే చాలా తక్కువ. పాత మోడల్ ధర రూ .63.94 లక్షలు నుండి ప్రారంభమై రూ.68.94 లక్షలు వరకు ఉంటుంది. 4వ జనరేషన్ మోడల్‌ను 2019 లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. జీప్ రాంగ్లర్ ఎస్‌యూ‌వి భారత మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్ బెంజ్ జి 350డి‌ వంటి ఎస్‌యూ‌వి కార్లతో పోటీ పడుతుంది.
undefined
click me!