అత్యంత శక్తివంతమైన ఇంజన్కొత్త బెంట్లీ బెంటెగా శక్తివంతమైన ఇంజన్ తో వస్తుంది. దీనికి 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 8 పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజిన్ 542 బిహెచ్‌పి (550 పిఎస్) శక్తిని, 568 (770 ఎన్ఎమ్) టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
డిజైన్ అండ్ లుక్కారు ముందు, వెనుక భాగంలోని కొత్త డిజైన్ ను అనుసరిస్తాయి. ఇది కారు విలాసవంతమైనదిగా కనిపించేలా చేస్తాయి. ఈ కొత్త బెంట్లీ కారు మొదటిసారి డార్క్ టింట్ డైమండ్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్‌తో వస్తుంది.
ఫీచర్స్కారు లోపలి భాగంలో కొత్త స్టైలిష్ సీట్లు అందించారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు వెనుక సీట్ వద్ద పెద్ద లెగ్‌రూమ్ వస్తుంది. ఈ కారులోని ఫీచర్స్ గురించి మాట్లాడితే 10.9-అంగుళాల స్క్రీన్‌తో నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సూపర్ హై-రిజల్యూషన్ గ్రాఫిక్స్, మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే ఇప్పుడు ఈ కారులో స్టాండర్డ్ వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ ఆటో కూడా అందించారు. ఇవి కాకుండా ఈ లగ్జరీ కారులో పొందుపరిచిన సిమ్‌ను ఉపయోగించి మై బెంట్లీ కనెక్టెడ్ సర్వీస్ ఎక్స్టెండెడ్ సూట్ కూడా అందుబాటులో ఉంది.
ధర, బుకింగ్ఢీల్లీలో కొత్త బెంట్లీ బెంటెగా ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ .4.10 కోట్లు. సంస్థ ఈ కారును బుకింగులను కూడా ప్రారంభించింది. ఢీల్లీ, ముంబై, హైదరాబాద్‌లోని కంపెనీ సేల్స్ టీం ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు.
బెంట్లీ బెంటెగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఎస్‌యూవీగా నిలిచింది. ఈ కారు నిజమైన బెంట్లీ డ్రైవింగ్ అనుభవాన్ని, మంచి పనితీరు, లగ్జరీని అందిస్తుంది. ఫస్ట్ జనరేషన్ మోడల్ యొక్క ప్రజాదరణ ఆధారంగా కొత్త బెంటాయిగా నిర్మించారు.