హోండా నుంచి టాటా వరకు తక్కువ ధరకే టాప్ ఎండ్ ఫీచర్స్ అందిస్తున్న ఈ బెస్ట్ కార్స్ గురించి తెలుసా..

First Published | Mar 17, 2021, 3:24 PM IST

చాలా మంది ప్రజలు అద్భుతమైన ఫీచర్లతో కూడిన లేటెస్ట్  కార్లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరికొందరు బేస్ వేరియంట్‌ను చూసిన వెంటనే  మొహం తిప్పేస్తుంటారు, ఎందుకంటే వాటిలో బేసిక్స్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి.

మీరు టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తేనే అందులో లేటెస్ట్ ఫీచర్లు మీకు లభిస్తాయి, అయితే అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు తమ కార్ల బేస్ వేరియంట్లలో కూడా టాప్ ఫీచర్లను అందిస్తున్నాయి, వీటిని మీరు కొనుగోలు చేయడం ద్వారా డబ్బు ఆదా చేయవచ్చు. అయితే ఆ కార్ల గురించి తెలుసుకుందాం ...
టాటా నెక్సాన్దేశంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందిన టాటా నెక్సాన్ గురించి తెలిసి ఉంటుంది. టాటా నెక్సన్ బేస్ వేరియంట్ ఎక్స్‌ఇలో ఈ‌బి‌డి విత్ ఎబిఎస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రోల్‌ఓవర్ మిటిగేషన్, హైడ్రాలిక్ బేస్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.ఇక దీని ఫీచర్స్ చూస్తే ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, మల్టీ డ్రైవ్ మోడ్‌లు, అమ్బ్రిల హోల్డర్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రై ఆరో డిఆర్‌ఎల్‌తో ఫ్రంట్ పవర్ విండోస్ వంటి ఫీచర్లతో వస్తుంది. అలాగే దీనిలో టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ అమర్చారు, ఇది 120 పిఎస్ శక్తిని, 170 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. అలాగే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ను గేర్ పొందుతుంది. నెక్సాన్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 7.09 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది.

టాటా టియాగోటాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగో భద్రత విషయంలో 4-స్టార్ రేటింగ్ లభించింది. దీని ఎక్స్‌ఇ బేస్ వేరియంట్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఇబిడితో ఎబిఎస్‌, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఓవర్ స్పీడ్ అలర్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్, ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.నెక్సాన్ లాగానే దీనిలో కూడా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బేస్ వేరియంట్లో అందుబాటులో లేదు. దీనికి 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 86 పిఎస్ శక్తిని, 113 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్ కి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో గేర్ వస్తుంది. టియాగో బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ .4.48 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 300పిల్లల భద్రత విషయంలో 4-స్టార్ రేటింగ్ పొందిన దేశంలో మొట్టమొదటి ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 300. ఈ కార్ భద్రత విషయంలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఎక్స్‌యూవీ 300 బేస్ డబల్యూ4 వేరియంట్‌లో ఆల్-డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఈ‌బి‌డితో ఏ‌బి‌ఎస్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్, పానిక్ బ్రేకింగ్ సిగ్నల్, హై మౌంటెడ్ స్టాప్ లాంప్, ఇమ్మొబిలైజర్ ఫీచర్స్ ఉన్నాయి. దీనికి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది, ఇది 110 పిఎస్ శక్తిని 200 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది.అలాగే మోనోక్రోమ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. మిగతా ఫీచర్ల గురించి చూస్తే ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ఓ‌ఆర్‌వి‌ఎంలు, టైర్ పొజిషన్ డిస్ ప్లే, ఫ్రంట్ ఎండ్ రియర్ పవర్ విండోస్, స్మార్ట్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్‌తో రియర్ పార్కింగ్ సెన్సార్లు లభిస్తాయి. దాని బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ .7.95 లక్షలు.
నిస్సాన్ కిక్స్పనితీరు పరంగా ఈ కారు ఉత్తమ ఎస్‌యూవీ కారు. అయితే నిస్సాన్ కిక్స్ బేస్ వేరియంట్లో టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో లేదు. కానీ దీనికి 1.5 లీటర్ హెచ్‌ఆర్ 15 పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది 106 పిఎస్ శక్తిని,142 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ అందించారు. కిక్స్ బేస్ వేరియంట్ లో2-డిన్ ఆడియో సిస్టమ్‌ను అందిస్తుంది, దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది.అలాగే నిస్సాన్ కిక్‌లకు 6-వే అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, అడ్జస్ట్ చేయగల హెడ్‌రెస్ట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేయగల ఓ‌ఆర్‌వి‌ఎంలు, వెనుక ఎసి వెంట్స్, ఆల్-పవర్ విండోస్, ఇంటెల్లి-సెన్సస్ సస్పెన్షన్ I-SPVTతో వస్తుంది. సేఫ్టీ ఫీచర్ గురించి మాట్లాడితే ఎక్స్‌ఎల్ వేరియంట్‌లో ఎబిఎస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హై మౌంటెడ్ స్టాప్ లాంప్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్ ఇమ్మొబిలైజర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ డీఫాగర్ ఉన్నాయి. దాని బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ .9.50 లక్షలు.
హోండా సిటీ (4వ జనరేషన్ )హోండా కంపెనీ 5వ జనరేషన్ హోండా సిటీని ప్రారంభించినప్పటికీ కంపెనీ ఇంకా పాత జనరేషన్ సిటీ కారును విక్రయిస్తోంది. 4వ జనరేషన్ హోండా సిటీ బేస్ వేరియంట్ ఎస్‌విలో ఎబిఎస్ విత్ ఇబిడి, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, రియర్ విండ్‌షీల్డ్ డీఫాగర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ హార్న్స్ ఉన్నాయి.దీనిలో 8.9 సెంటీమీటర్ల ఎల్‌సిడి స్క్రీన్‌, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. దీనికి 1.5-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజిన్‌ అందించారు, ఇది 119 పిఎస్ శక్తిని, 145 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. 4వ జనరేషన్ హోండా సిటీ బేస్ వేరియంట్ ధర 9,29,900 లక్షలు.

Latest Videos

click me!