లగ్జరీ కాస్ట్లీ కార్లు కొనేఅంతా ఉన్న మహీంద్ర కంపెనీ కార్లనే వాడుతున్న ఆనంద్ మహీంద్ర.. కారణం ఏంటంటే ?

First Published Mar 8, 2021, 6:33 PM IST

భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో ఇక్కడి చాలా మంది పెద్ద వ్యాపారవేత్తల కృషి కూడా ఉంది. వారు స్థాపించిన సంస్థల కృషి కారణంగా  భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో సహాయ సహకారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 

వారిలో ఒకరు మహీంద్రా అండ్ మహీంద్రాగ్రూప్ లిమిటెడ్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మహీంద్రా. ఆయన పేదవారికి సహాయం చేయడంలో ముందుంటాడు. అలాగే ఇతర వ్యాపారవేత్తల లాగానే అతను కూడా అద్భుతమైన లైఫ్ స్టయిల్ గడుపుతున్నడు, ఇంకా మిగతావారి కంటే చాలా భిన్నంగా ఉంటాడు. కాబట్టి ఆనంద్ మహీంద్రా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం....
undefined
ఆనంద్ మహీంద్రా 1 మే 195న ముంబైలో జన్మించారు. ఆనంద్ మహీంద్ర తాత, సోదరులు పంజాబ్ లోని లుధియానాలో ఉక్కు వ్యాపారం చేస్తుండేవారు. అయితే ఆనంద్ మహీంద్ర ట్రాక్టర్ల వ్యాపారం తరువాత నేడు మహీంద్రా కంపెనీ ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లను కూడా ఉత్పత్తి చేసే సంస్థగా మారింది. 1977 సంవత్సరంలో ఆనంద్ మహీంద్రాకు ఈ సంస్థ పూర్తి బాధ్యత లభించింది.
undefined
ఆనంద్ మహీంద్రా ఉదయం సమయంలో సొంతంగా అల్పాహారం తయారుచేసుకుంటారన్న విషయం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్ర అల్పాహారం సమయంలో ఇడ్లీ తినడం ఎక్కువగా ఇష్టపడతాడు.
undefined
ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అయిన వీడియొలు, ఫోటోలను షేర్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో అతనికి ఫాన్స్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే, ఇంకా ప్రజలు కూడా అతని అభిప్రాయాలను చాలా ఇష్టపడతారు.
undefined
మీరు ఆనంద్ మహీంద్రా కార్ల కలెక్షన్స్ చూస్తే నిజంగా అవాక్కైపోతారు, ఆయన కావాలనుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను కొనుగోలు చేయవచ్చు. కానీ అతను తన సంస్థ మహీంద్ర తయారు చేసిన కార్లను మాత్రమే ఉపయోగిస్తారు.
undefined
ఆనంద్ మహీంద్రా తన కంపెనీ కార్లను ఉపయోగించడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మా కంపెనీ కార్లను నేను ఉపయోగించకపోతే మా కస్టమర్లు మా కంపెనీ కార్లను ఎలా నమ్ముతారు అని.
undefined
2015 నుండి ఆనంద్ మహీంద్ర సంస్థకి చెందిన మహీంద్రా టియువి కారును ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. ఇది కాకుండా మహీంద్ర టియువి 300 ప్లస్, స్కార్పియో, ఆల్టరస్ జి4 కారులను కూడా వాడుతుంటాడు.
undefined
ఆనంద్ మహీంద్రా సంస్థ ప్రతి సంవత్సరం భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఆనంద్ మహీంద్రా నికర విలువ గురించి మాట్లాడితే ఫోర్బ్స్ పత్రిక ప్రకారం, అతని నికర విలువ రెండు బిలియన్ డాలర్లు అంటే సుమారు 200 కోట్లు.
undefined
undefined
click me!