లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేని బైక్ వచ్చేసింది.. ధర కూడా చాలా తక్కువ..

Ashok Kumar   | Asianet News
Published : Mar 06, 2021, 05:50 PM IST

హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ అటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్  కొత్త జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్ అటం 1.0 డెలివరీలని ప్రారంభించింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ .50వేలతో కంపెనీ గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ బైక్‌ను విడుదల చేసింది. ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 400 యూనిట్లు బుక్ అయ్యాయి. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ బైక్‌ను అటోమొబైల్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

PREV
17
లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేని బైక్ వచ్చేసింది.. ధర కూడా చాలా తక్కువ..

 బ్యాటరీ  ఇంకా మైలేజ్ 
అటం 1.0 ఈ-బైక్ లో పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఈ బ్యాటరీ కేవలం 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అటమ్ 1.0 ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల  వరకు ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పై 2 సంవత్సరాల వారంటీ వస్తుంది. నగరంలో పిల్లలు, పెద్దలు ప్రయాణించటానికి సరైనది.
 
27

 ఈ బైక్ ని వివిధ రంగులలో కొనుగోలు చేయవచ్చు. పర్యావరణనికి అనుకూలమైన అటం 1.0 సౌకర్యవంతంగా, అధిక పనితీరు ఇస్తుంది. ఈ బైకుని విభిన్న పరిస్థితులలో పరీక్షించి విజయవంతమైన తర్వాత డిజైన్ ఆమోదించబడింది. ఆ తరువాత వచ్చిన  ఫైనల్ ఉత్పత్తి మీకు ప్రీమియం రేసర్ అనుభూతిని ఇస్తుంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ బైక్ స్వదేశీ పరికరాల నుండి తయారవుతుంది.

37

అటం 1.0లో 6 కిలోల తేలికపాటి పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.  3 పిన్ సాకెట్‌ ద్వారా ఛార్జ్ చేయవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అటం 1.0 ను మైన్ టైన్  చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అటామ్ 1.0 ద్వారా 100 కిలోమీటర్ల దూరాన్ని ప్రయనించడానికి సాధారణంగా 7 నుండి 8 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని  కంపెనీ తెలిపింది.  అదే ఐసిఇ బైక్‌లో 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి 80 నుంచి 100 రూపాయలు ఖర్చవుతుంది.

47

అటం 1.0 ఎలక్ట్రిక్ బైక్‌లో రోడ్డు మీద వెళ్ళేందుకు హెవీ టైర్లు, సౌకర్యవంతమైన సీట్లు, డిజిటల్ డిస్‌ప్లేతో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఇండికేటర్స్, టైల్  లైట్స్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.  

57

రిజిస్ట్రేషన్,  లైసెన్స్ అవసరం లేదు
అటామ్ 1.0 ను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ తక్కువ-స్పీడ్ బైక్‌గా ఆమోదించింది, దీనిని వాణిజ్య ఉపయోగం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. అదనంగా అటామ్ 1.0 కు ఎలాంటి బైక్  రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఇంకా దానిని నడుపుతున్న వారికి లైసెన్స్ అవసరం లేదు. టీనేజ్   కూడా దీనిని ఉపయోగించవచ్చు. 
 
67

భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో  అధిక  పనితీరు, రేసర్ స్టయిల్ లో ఈ ఎలక్ట్రిక్ బైక్  ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కొత్త అటామ్ 1.0  బైక్ ధర రూ .50,000. ఈ బైక్ అటోమోబిల్ ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా భారతదేశం అంతటా అందుబాటులో ఉంది.

77
click me!

Recommended Stories