అప్ డేట్ స్టయిల్, లుక్ తో 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 : కొత్త మార్పులు, ధర ఎంతో తెలుసుకోండి..

First Published | Mar 6, 2021, 3:06 PM IST

బైక్ రైడింగ్ అంటే ఇష్టపడేవారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మొదటి ఎంపికగా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్  బైక్ పై ముఖ్యంగా యువతలో మంచి జ్రెజ్ ఏర్పడింది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్  పాపులర్ మోడల్ క్లాసిక్ 350 బైకుని చాలా కాలంగా పరీక్షిస్తోంది. 
 

త్వరలో సంస్థ దీన్ని కొత్త లుక్ తో ప్రవేశపెట్టబోతోంది. సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 టెస్టింగ్ సమయంలో మరోసారి కనిపించింది. ఈ బైక్ కొత్త వెరీఎంట్ ఫోటోలు చూస్తే చాలా పెద్ద మార్పులను చేసినట్టు తెలుస్తుంది. ఈ బైక్ 2021 మోడల్‌లో ముఖ్యమైన అప్ డేట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.
కొత్త ప్లాట్ ఫార్మ్రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త క్లాసిక్ 350లో ముఖ్యమైన మార్పులలో ఒకటి దీనిని కొత్త ప్లాట్‌ఫామ్‌పై తీసుకురాబోతోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇప్పటికే మిటియర్ 350 బైక్ ని కంపెనీ ఉపయోగిస్తోంది. కొత్త ప్లాట్‌ఫాం రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత ప్రాచుర్యం పొందిన బైకుల రోడ్ రైడింగ్ స్టయిల్ మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

కొత్త ఇంజిన్కొత్త ప్లాట్‌ఫామ్‌తో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 343 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్ అందించనున్నారు. ఒక నివేదిక ప్రకారం ఈ కొత్త ఇంజన్‌ క్లాసిక్ 350 ప్రస్తుత మోడల్ సౌండ్, వైబ్రేషన్ కంటే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే కొత్త ఇంజిన్ పాత ఇంజిన్ కంటే మెరుగైన నాణ్యతతో వస్తుంది.
ట్రిప్పర్ నావిగేషన్ఇటీవల లాంచ్ చేసిన హిమాలయన్ 2021బైకులో చూసినట్లుగా కొత్త క్లాసిక్ 350లో ట్రిప్పర్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్‌ను తీసుకొస్తుంది. గతేడాది మేటియర్ 350తో తొలిసారిగా ఈ ఫీచర్ లాంచ్ చేశారు.
అప్ డేట్ చేసిన బాడీ ప్యానెల్కొత్త క్లాసిక్ 350 బైక్ లుక్ లో చాలా మార్పులను చేసింది. కొత్త బైక్‌కి కొత్త సీట్ కుషనింగ్, అప్‌డేటెడ్ స్విచ్ గేర్ వంటి ఫీచర్స్ లభిస్తాయి. ఇది కాకుండా ఎగ్జాస్ట్ సిస్టంలో కూడా కొన్ని మార్పులు చేసింది.
కొత్త మోడల్ ధరరాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ప్రస్తుత మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 1.67 లక్షల రూపాయలు. అయితే కొత్త క్లాసిక్ 350 మోడల్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ .1.72 లక్షల నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

Latest Videos

click me!