టోక్యో ఒలింపిక్ విజేతకి రెనాల్ట్ సంస్థ అద్భుతమైన గిఫ్ట్.. దీని స్పెషాలిటీ ఎంటో తెలుసా..?

First Published | Aug 19, 2021, 11:01 AM IST

టోక్యో ఒలింపిక్స్ 2020 రజత పతక విజేత సాయిఖోమ్ మీరాబాయ్ చానుకి రెనాల్ట్ సంస్థ (రెనో ఇండియా)  కొత్త కిగర్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చింది. రెనాల్ట్  సంస్థ ఇండియాలో అడుగుపెట్టి 10వ సంవత్సరాలు కావొస్తుంది. 

 ఈ నెలలో ముగిసిన టోక్యో ఒలింపిక్స్ 2020లో వెయిట్ లిఫ్టర్  మీరాబాయ్ చాను అద్భుతమైన ప్రదర్శనకి రెనాల్ట్ ఈ ప్రకటన చేసింది. రెనో ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ మల్హోత్రా  మీరాబాయి చానుకు కొత్త కైగర్ ఎస్‌యువి కీని అందజేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో కిగర్ ఎస్‌యూవీ రూ .5.45 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) భారతదేశంలో విడుదలైంది. దీనిని మొదట నాలుగు ట్రిమ్ లెవెల్స్ లో అందించారు - వీటిలో RXE, RXL, RXT, RXZ ఉన్నాయి. స్పోర్టీ లుక్, ఆకర్షణీయమైన డిజైన్, బడ్జెట్ ఎస్‌యూ‌వి కారణంగా కిగర్ భారతీయ మార్కెట్లో అద్భుతంగా రాణిస్తోందని సంస్థ తెలిపింది.


ఇంజన్ అండ్ మైలేజ్

రెనాల్ట్ కిగర్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది-1.0-లీటర్ పెట్రోల్ అండ్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ కారు గేర్  ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ 5-స్పీడ్ మాన్యువల్, ఏ‌టి ఏ‌ఎన్‌డి సి‌వి‌టి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్  72 పిఎస్ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 100 పి‌ఎస్ పవర్, 160 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  సి‌వి‌టి ఆప్షన్ 152ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారుతో స్టాండర్డ్ గా వస్తుంది. 1.0-లీటర్ పెట్రోల్‌తో 5-స్పీడ్ EASY-R AMT గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది. 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ X-TRONIC CVT గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. రెనాల్ట్ కిగర్ లో మల్టీసెన్స్ డ్రైవ్ మోడ్ ఫీచర్ ఇచ్చారు. ఈ ఎస్‌యూ‌వి సాధారణంగా 17 నుండి 20 kmpl మైలేజ్ ఇస్తుంది. 

లుక్స్ అండ్ డిజైన్

రెనాల్ట్ కిగర్ ఎస్‌యూ‌వికి  హెడ్‌ల్యాంప్‌లు, అందమైన ఎల్‌ఈ‌డి డి‌ఆర్‌ఎల్, ఆకర్షణీయమైన బోనెట్ రూపాన్ని, సిగ్నేచర్ ఫ్రంట్ మెయిన్ గ్రిల్  స్టైలింగ్‌ను చూస్తే  కంపెనీ ప్రముఖ ఎంట్రీ లెవల్ క్రాస్‌హాచ్ కార్ క్విడ్ లాగా అనిపిస్తుంది.  కారు వెనుక భాగంలో  C-ఆకారపు ఎల్‌ఈ‌డి టెయిల్ ల్యాంప్‌లు ఇచ్చారు  ఈ లైట్స్ చాలా షార్ప్ అండ్ లేటెస్ట్ గా కనిపిస్తుంది. 

ఇంటీరియర్ అండ్ ఫీచర్లు

కిగర్ ఇంటీరియర్ గురించి మాట్లాడితే కారు క్యాబిన్ లోపల చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కారులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ రెప్లికేషన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్,  2.5 క్లీన్ ఎయిర్ ఫిల్టర్, 20.32 సెం.మీ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సపోర్ట్ ఆపిల్ కార్‌ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లోటింగ్ రూఫ్‌టాప్, ARKAMYS 3D సౌండ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఫీచర్లు వంటివి ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ అంటే కీలెస్ యాక్సెస్, వాయిస్ రికగ్నిషన్, క్రూయిజ్ కంట్రోల్ ఇచ్చారు.
 

భద్రతా ఫీచర్లు

భద్రతా ఫీచర్ల గురించి మాట్లాడితే  కొత్త ఎస్‌యూ‌వి  కిగర్ లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరాలు, ఏ‌బి‌ఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈ‌బి‌డి (ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సరౌండ్ వ్యూ మిర్రర్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ పొందుతుంది. సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు   అందించారు. 

కిగర్ ఎస్‌యూ‌వి రెనాల్ట్  మాడ్యులర్ CMF-A+ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ గతంలో ఈ ప్లాట్‌ఫారమ్‌ను ట్రైబర్‌లో ఉపయోగించింది. ఎస్‌యూ‌వి సైజ్ గురించి మాట్లాడితే కిగర్ ఎస్‌యూ‌వి సైజ్ మాగ్నైట్ లాగే ఉంటుంది. మాగ్నైట్ ఎస్‌యూ‌వి పొడవు 3994 ఎం‌ఎం, వెడల్పు 1758 ఎం‌ఎం , ఎత్తు 1572 ఎం‌ఎం. ఈ కారు దాని సెగ్మెంట్‌లో అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ 205 ఎం‌ఎం, 2500 ఎం‌ఎం వీల్‌బేస్ ఇచ్చింది.

రెనాల్ట్ కిగర్ వేరియంట్ల ఆధారంగా మే 2021లో కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు.

1.0 లీటర్ పెట్రోల్ మోడల్
RXE - రూ.5.45 లక్షలు
RXE DT - రూ.5.65 లక్షలు 
RXL - రూ.6.32 లక్షలు 
RXL AMT - రూ. 6.82 లక్షలు 
RXL DT (MT / AMT) - రూ. 6.52 / 7.02 లక్షలు 
RXT - రూ.6,80 లక్షలు 
RXT AMT - రూ.7.30 లక్షలు  
RXT DT (MT / AMT) - రూ.7.00 / 7.50 లక్షలు 
RXZ - రూ. 7.69 లక్షలు
RXZ AMT - రూ. 8.19 లక్షలు
RXZ DT (MT / AMT) - రూ .7.89 / 8.39 లక్షలు 

1.0 లీటర్ టర్బో పెట్రోల్ మోడల్

RXL - రూ..42 లక్షలు
RXL DT - రూ.7,62 లక్షలు
RXT - రూ.7.90 లక్షలు
RXT DT (MT / CVT) - రూ. 8.10 / 8.80 లక్షలు
RXZ - రూ.8.79 లక్షలు
RXZ CVT - రూ.9.55 లక్షలు
RXT CVT - రూ.8.60  లక్షలు
RXZ DT (MT / CVT) - రూ.8.99 / రూ. 9.75 లక్షలు
 

ఇండియాలో రెనాల్ట్ 10 సంవత్సరాలు పూర్తి చేయడంలో భాగంగా కంపెనీ రెనాల్ట్ కిగర్  సరికొత్త RXT (O) వేరియంట్‌ను విడుదల చేసినట్లు  ప్రకటించింది.   రెనాల్ట్ ఇండియా ప్రస్తుతం భారతదేశంలో 500 కి పైగా సేల్స్ అండ్ సర్వీస్ టచ్ పాయింట్‌లను కలిగి ఉంది, ఇందులో దేశవ్యాప్తంగా 200 కి పైగా వర్క్‌షాప్ ఆన్ వీల్స్ లొకేషన్స్ ఉన్నాయి.
 

Latest Videos

click me!