కియా మోటార్స్ లేటెస్ట్ కార్ టీజర్ అవుట్, త్వరలోనే ఇండియాలో లాంచ్.. వీడియో చూసారా..

First Published Aug 18, 2021, 12:06 PM IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ కొత్త కారు టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. వీడియోలో కారు పేరు ప్రాజెక్ట్  ఎక్స్ అని సూచించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కియా సెల్టోస్ ఎక్స్ లైన్‌ను ఇప్పుడు కంపెనీ పరిచయం చేస్తుందని భావిస్తున్నారు.

 కారు టీజర్ వీడియోలో ప్రాజెక్ట్ఎక్స్ ని త్వరలో ఆవిష్కరించనున్నట్లు  తెలుస్తుంది. కియా మోటార్స్ ఇండియాలో సెల్టోస్ ఎస్‌యూవీని లాంచ్ చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సెల్టోస్ అన్నివర్సరీ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. దేశంలో సెకండ్ అన్నివర్సరీ సెల్టోస్ ఈవెంట్ లో రాబోయే ఎక్స్ లైన్ ప్రవేశపెట్టవచ్చు. 

ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు,  డేటైమ్ రన్నింగ్ లైట్లు గ్రిల్‌తో వస్తున్న సెల్టోస్ ఎక్స్  లైన్ త్వరలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఆటో ఎక్స్‌పో 2020లో కియా సెల్టోస్ ఎక్స్ లైన్ కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. 

సెల్టోస్  స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే ఈ కారు ఆకర్షణీయమైన కలర్ థిమ్స్, కాస్మెటిక్ అప్‌డేట్స్ పొందుతుంది. సెల్టోస్ ఎక్స్ లైన్ కి పూర్తిగా భిన్నమైన స్టైలింగ్ ఫ్రంట్ గ్రిల్‌తో బ్లాక్ కలర్ లో పెయింట్ ఇచ్చింది. ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈ‌డి డేటైమ్ రన్నింగ్ లైట్లు చాలా భిన్నంగా కనిపిస్తాయి. బ్లాక్ ఎయిర్ డ్యామ్ అండ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌పై విభిన్న కలర్ టోన్స్ ఉంటాయి. ప్రొడక్షన్-స్పెక్ మోడళ్లలో ఇవి ఉంటాయని భావిస్తున్నారు.
 

ఇతర డిజైన్ అంశాల గురించి మాట్లాడితే  దీనికి రైల్ ట్రాక్స్, డ్యూయల్ టోన్ బాడీ పెయింట్ ఇచ్చింది. సెల్టోస్ ఎక్స్  లైన్ స్టాండర్డ్ ఎడిషన్ కంటే స్పోర్టియర్‌గా కనిపించేల చేయడానికి మరిన్ని యాక్సెసరీలతో వస్తుంది. క్యాబిన్ లోపల సీట్లు అప్హోల్స్టరీ అండ్ డాష్‌బోర్డ్‌పై కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో స్పోర్టివ్ లుక్ ఇస్తుంది.
 

కారు ఔటర్ అండ్ క్యాబిన్ లోపల చాలా కాస్మెటిక్ అప్‌డేట్‌లు కనిపిస్తాయి. కారు మెకానికల్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే సెల్టోస్ ఎక్స్ లైన్ స్టాండర్డ్ మోడల్‌లాగే ఉంటుంది. సెల్టోస్  1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 114హెచ్‌పిని, 1.4-లీటర్ జి‌డి‌ఐ టర్బో పెట్రోల్ ఇంజన్  138హెచ్‌పిని,  1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ 114హెచ్‌పితో లభిస్తుంది. గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, సివిటి అండ్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తాయి.

ప్రస్తుతం సెల్టోస్ వేరియంట్ లైనప్ టెక్-లైన్ అండ్ జిటి-లైన్‌గా విభజించారు. కొత్త వేరియంట్ జి‌టి- లైన్ పైన వస్తుందా లేదా అనేది దాని లాంచ్ లో తెలుస్తుంది. 
 

click me!