ఇండియాలోనే అత్యధిక మైలేజ్ కలిగిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని ఫీచర్స్, ధర తెలుసుకోండి..

First Published | Aug 16, 2021, 3:22 PM IST

బెంగళూరు ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (ఈ‌వి) స్టార్టప్ సింపుల్ ఎనర్జీ  ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కూడా ఈ స్కూటర్‌పై  పొందవచ్చు. సింపుల్ ఎనర్జీ  ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ఇప్పుడు దేశంలో అత్యధిక డ్రైవింగ్ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మారింది. గొప్ప లుక్స్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ .1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కంపెనీ  ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ .1,947 టోకెన్ మొత్తం చెల్లించి అధికారిక వెబ్‌సైట్‌కొ బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ మొత్తాన్ని రీఫండ్ చేస్తుంది అంటే బుకింగ్ రద్దు చేసిన తర్వాత కంపెనీ పూర్తి మొత్తాన్ని కస్టమర్‌కు తిరిగి చెల్లిస్తుంది. స్కూటర్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత డెలివరీలు ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లకు ప్రాధాన్యత అందించనున్నారు.  
 

బ్యాటరీ

సింపుల్ ఎనర్జీ  ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 kWh పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఈ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ బూడిద రంగులో 6 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తయారు చేసారు. ఛార్జింగ్ కోసం ఈ బ్యాటరీని సులభంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు. సింపుల్ లూప్ ఛార్జర్ 60 సెకన్లలో 2.5 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి తగినంత ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. సింపుల్ వన్ లాంచ్ చేసిన వెంటనే ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. రాబోయే మూడు నుండి ఏడు నెలల్లో కంపెనీ దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్‌లను కూడా ఇన్‌స్టాల్ చేయనుంది.


రేంజ్ అండ్ స్పీడ్

సింపుల్ వన్ ఇ-స్కూటర్ ఎకో మోడ్‌లో 203 కి.మీలు, ఇండియన్ డ్రైవ్ సైకిల్ (ఐడిసి) షరతులలో 236 కిలోమీటర్ల దూరాన్ని ఒక్క పూర్తి ఛార్జ్‌లో కవర్ చేయగలదు. దీని గరిష్ట వేగం గంటకు 105 కి. సింపుల్ వన్ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో 0 నుండి 50 కి.మీల వేగాన్ని, 2.95 సెకన్లలో 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ స్కూటర్ 72 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది అలాగే మిడ్ డ్రైవ్ మోటార్‌పై ఆధారపడి ఉంటుంది. 30-లీటర్ బూట్ కెపాసిటీ, 12-అంగుళాల వీల్స్, 7-అంగుళాల కస్టమైజ్డ్ డిజిటల్ డాష్‌బోర్డ్, ఆన్-బోర్డ్ నావిగేషన్, జియో-ఫెన్సింగ్, ఎస్‌ఓ‌ఎస్ మెసేజ్‌లు, డాక్యుమెంట్ స్టోరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. సింపుల్ వన్ ఇ-స్కూటర్ ఎరుపు, తెలుపు, నలుపు, నీలం అనే నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

 సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ ప్రీమియం ఇ-స్కూటర్ విభాగంలో పోటీని పెంచుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే భారత మార్కెట్లో ఏథర్, హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీని ఇస్తుంది. 
 

 మొదటి దశలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గోవా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌తో సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో అందుబాటులోకి రానుంది. సింపుల్ ఎనర్జీ ఈ రాష్ట్రాల్లోని నగరాల్లోని ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ల కోసం షార్ట్‌లిస్ట్ చేసిన లొకేషన్‌లు ఉన్నాయని, తద్వారా దీనిని త్వరలో విస్తరించవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా  కంపెనీ ఉనికిని విస్తరించేందుకు వచ్చే రెండేళ్లలో రూ .350 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఫ్యాక్టరీ  మొదటి దశ 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది, అలాగే ఏటా 1 మిలియన్ (10 లక్షల) యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ప్రారంభంలో కనీసం 1,000 ఉద్యోగాలను కూడా కల్పించనుంది.  

Latest Videos

click me!