
Kia Seltos 2026 : లగ్జరీ ఫీచర్లతో వస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కాంపిటీషన్లో కూడా ఒక కారు క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఏకంగా ఏడు లక్షల కార్లను అమ్మి దేశీయ మార్కెట్లో అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. అసలు ఆ ఎస్యూవీ కారు ఏంటి? దానికి అంత డిమాండ్ ఎందుకు? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సూపర్ పాపులర్ అయిన కియా (KIA) కారు ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంది. దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ అమ్మకాలు ఏకంగా 7 లక్షల యూనిట్లను క్రాస్ చేసి దూసుకుపోతున్నాయి. 2019లో ఫస్ట్ లాంచ్ అయిన ఈ ఎస్యూవీ కారు ఇండియాలో కియా బ్రాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన సెకండ్ జనరేషన్ మోడల్‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ కియా సెల్టోస్ ఎస్యూవీ కారు సరికొత్త రికార్డును సెట్ చేసింది.
ఇండియాలో సెల్టోస్ ఎంత పాపులర్ అయిందంటే.. కేవలం ఏడేళ్లలో ఏడు లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. కియా తయారు చేసిన మొదటి ఎస్యూవీ కారు ఆగస్టు 22, 2019న లాంచ్ అయింది. అప్పటి నుంచి గత అక్టోబర్ 2026 వరకు దేశీయ మార్కెట్లో మొత్తం 7,04,829 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇండియాలో కియా అమ్మిన మొత్తం 16.8 లక్షల కార్లలో సెల్టోస్ వాటానే సుమారు 36 శాతం ఉండటం విశేషం.
ఈ కారు కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా ఎగుమతుల్లో కూడా దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు 1.6 లక్షలకు పైగా సెల్టోస్ కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. ఇటు ఇండియాలో రికార్డ్ సేల్స్ నమోదు చేస్తూనే, అటు ఫారిన్ మార్కెట్లో కూడా తన ఆధిపత్యాన్ని చూపిస్తోంది కియా సెల్టోస్.
ఇండియాలో కియా సెల్టోస్ కారు ధర రూ. 11 లక్షల నుంచి మొదలవుతుంది. అంటే మధ్యతరగతి ప్రజల బడ్జెట్లో అందుబాటులో ఉండే ఎస్యూవీ కారు ఇది. దేశీయ, విదేశీ మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో ఇప్పుడు సెకండ్ జనరేషన్ సెల్టోస్ మోడల్ సేల్స్‌కు మంచి బూస్ట్ దొరికినట్లు అయింది. ఈ ఏడాది జనవరిలో సరికొత్త లుక్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు జనాలను బాగా ఆకర్షిస్తోంది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఒకే ఏడాదిలో ఏకంగా 1,13,078 కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన 60,526 యూనిట్లతో పోలిస్తే ఇది 87 శాతం ఎక్కువ.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు తొమ్మిది నెలల్లో ఏకంగా 1,02,439 కార్లు అమ్ముడయ్యాయి. అంటే జనాలు ప్రతి నెలా సగటున 11,000 కు పైగా వాహనాలను కొన్నారన్నమాట! కానీ జనవరిలో మాత్రం కాస్త తక్కువగా సుమారు 10,639 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఆ తర్వాత జూన్ నెల మినహాయిస్తే ప్రతీ నెలా 10,000 కు పైగా కార్లు సేల్ అయ్యాయి. ముఖ్యంగా అక్టోబర్ నెలలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఆ ఒక్క నెలలోనే ఏకంగా 33,462 కార్లు అమ్ముడయ్యాయి అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇండియాలో కియా ఒకే నెలలో ఈ స్థాయిలో కార్లను అమ్మడం ద్వారా ఏడు లక్షల సేల్స్ రికార్డును క్రియేట్ చేసింది.
కియాలో సెకండ్ అత్యధికంగా అమ్ముడవుతున్న కారు సోనెట్ కాగా, ఇది సెల్టోస్ కంటే దేశీయ మార్కెట్లో సుమారు 1.1 లక్షల యూనిట్లు వెనుకబడి ఉంది. క్యారెన్స్ సిరీస్ ఇప్పటి వరకు 3,31,186 కార్లను అమ్మింది.
మిడ్-సైజ్ ఎస్యూవీ కార్లు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లతో సహా 20 కి పైగా మోడల్స్ భారత మార్కెట్లో గట్టి పోటీ పడుతున్నాయి. ఇంతటి కాంపిటీటివ్ మార్కెట్లో కూడా సెల్టోస్ తన పట్టును నిలబెట్టుకుంది. 2026 జనవరి నుంచి అక్టోబర్ మధ్యలో 81,090 కార్లను అమ్మి మిడ్-సైజ్ ఎస్యూవీ సేల్స్‌లో నాలుగో స్థానంలో ఉంది. ఈ లిస్ట్‌లో మహీంద్రా స్కార్పియో 1,12,841 యూనిట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. హ్యుందాయ్ క్రెటా 1,07,682 యూనిట్లతో రెండో స్థానంలో ఉండగా, మారుతి విక్టోరిస్ 88,804 యూనిట్లతో మూడో స్థానంలో ఉంది.