వెలోసెట్ కంపెనీను తొలుత 1896లో జాన్ గుడ్‌మాన్, విలియం గూ "టేలర్, గ్యూ కో లిమిటెడ్"గా స్థాపించారు. కంపెనీ మొదట్లో సైకిల్ ఫ్రేమ్‌లు, ఇతర భాగాలను తయారు చేసేది, కానీ తరువాత అది మోటార్ సైకిళ్ల కోసం ఫ్రేమ్‌లను రూపొందించడం ప్రారంభించింది. 1905 సంవత్సరంలో కంపెనీ తన మొదటి మోటార్‌సైకిల్ వెలోస్‌ను తయారు చేసింది. 1913లో కంపెనీ తన మొదటి టూ-స్ట్రోక్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది, దీనికి వెలోసెట్ అనే నిక్ నేమ్ ఇచ్చింది. దీనిలో కె సిరీస్ బైక్‌లను 1925 సంవత్సరంలో ప్రారంభించగా.. కె సిరీస్ బైక్‌ల ధర ఎక్కువగా ఉండటంతో, తక్కువ ధరకే బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. 1934 సంవత్సరంలో కొత్త ఎమ్ సిరీస్ ఓవర్ హెడ్ వాల్వ్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది.