అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పుంజుకోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దేశీయంగా కూడా రికార్డు స్థాయిని తాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు అడుగులువేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లతో పాటు, CNG కార్లపై కూడా కస్టమర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా డీజిల్ ధర బల్క్ మార్కెట్ లో ఏకంగా 25 రూపాయలు పెంచడంతో, భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో CNG కార్ల రేసు తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విభాగంలో మారుతి బాలెనో 2022 (Maruti Baleno) కారు ఇప్పటికే అదరగొడుతుండగా, ప్రత్యర్థి కంపెనీ అయిన టయోటా నుంచి గ్లాంజా 2022 (Toyota Glanza 2022) త్వరలో CNG వేరియంట్‌లో రాబోతోంది. ఈ విషయాన్ని టయోటా స్వయంగా వెల్లడించింది.
తాజా సమాచారం ప్రకారం ఈ టయోటా కారు (Toyota Glanza 2022) ఒక కేజీ సిఎన్‌జి గ్యాస్ తో ఏకంగా 25 కి.మీ మైలేజీని ఇవ్వనుంది. అంటే ఢిల్లీ వినియోగదారులకు కిలోమీటరుకు ధర దాదాపు రూ.2 మాత్రమే ఖర్చు అవుతుంది. టయోటా గ్లాంజా 2022 (Toyota Glanza 2022) గత వారం భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇది అనేక కొత్త అప్ డేషన్, ఫీచర్లు-డిజైన్‌లతో లాంచ్ చేసింది. అయితే, చాలా ఫీచర్లు ఈ నెల ప్రారంభంలో ప్రారంభించిన మారుతి బాలెనో 2022 లాగా కనిపిస్తాయి.
లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు
టయోటా ఈ ప్రీమియం సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ కారును టయోటా గ్లాంజా E-CNG పేరుతో మార్కెట్లో తెచ్చే అవకాశం ఉంది. అయితే, కంపెనీ ఇంకా దాని లాంచ్ తేదీని వెల్లడించలేదు. మరికొద్ది నెలల్లోనే షోరూమ్‌లలో ఈ కారు విడుదల కావచ్చని భావిస్తున్నారు. K సిరీస్ ఇంజిన్ ఈ కారులో కనిపిస్తుంది.
ఇంజిన్, పవర్
మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా రెండూ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తాయి, ఇవి రన్ చేసినప్పుడు 90 PS పవర్ 113 Nm టార్క్ ఉత్పత్తి చేయగలవు. రెండు కార్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఐదు-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికతో వస్తున్నాయి.