Harley Davidson New Electric Bike: హార్లే డేవిడ్సన్ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్..!

First Published Feb 20, 2022, 12:58 PM IST

అమెరికాకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ త్వరలోనే మరో ఎలక్ట్రిక్ బైక్ తీసుకురానుంది. లైవ్‌వైర్ బ్రాండ్ కింద మార్కెట్లోకి రానుంది. ఈ బైక్ ను S2 Del Marగా పిలవనున్నారు.

మార్కెట్లో రకరకాల బైక్స్‌ విడుదలవుతున్నాయి. యువతను దృష్టిలో ఉంచుకుని పలు వాహనాల తయారీ కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. 

Royal Enfield Himalayan

 ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక అమెరికాకు చెందిన ప్రీమియం మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్‌ త్వరలోనే మరో ఎలక్ట్రిక్‌ బైక్‌ ( Electric Bike) తీసుకురానుంది. 

Royal Enfield Himalayan

అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్ రానుంది. లైవ్‌వైర్ బ్రాండ్ కింద దీన్ని మార్కెట్లోకి తీసుకురానుంది.

S2 Del Marగా చెబుతున్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఈ ఏడాది జూన్-ఏప్రిల్ మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మిడిల్-వెయిట్ విభాగంలోకి వస్తుంది.

యారో ఆర్కిటెక్చర్‌తో కూడిన ఈ బైక్‌లో ముఖ్యమైన భాగాలు బ్యాటరీ, ఇన్వర్టర్, ఛార్జర్, స్పీడ్ కంట్రోలర్, మోటార్‌ వంటివి ఎలక్ట్రిక్ బైక్‌ మోడల్‌కి సంబంధించినవే ఉంటాయి. యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీ కేవలం ఈ ఒక్క ఎలక్ట్రిక్ బైక్‌‌ తయారీకి మాత్రమే కాదు. అవే భాగాలతో విభిన్నమైన మోడల్స్, డిజైన్స్‌ను రూపొందిస్తుంది.

యారో ఆర్కిటెక్చర్ ద్వారా 21,7000 రకాల సిలిండ్రికల్ సెల్స్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌ కోసం హార్లే డేవిడ్సన్ ఉపయోగిస్తోంది. ఇదే ఫార్మాట్‌ను టెస్లా, శాంసంగ్ వంటి కంపెనీలు కూడా ఉపయోగిస్తున్నాయి. 

ఎస్2 డెల్ మార్ మిడిల్ వెయిట్ విభాగానికి చెందినదే అయినప్పటికీ... ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా లైటర్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కూడా తయారుచేస్తారు. హార్లే డేవిడ్సన్ లైవ్‌వైర్‌ ఇప్పటికే తైవాన్‌కి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ Kymcoతో టైఅప్ అయింది. భవిష్యత్తులో ఈ రెండు సంస్థలు కలిసి యారో ఆర్కిటెక్చర్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి. 

click me!