జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ లుక్ జీప్ కంపాస్ ఎస్‌యూవీని తలపిస్తుంది. అలాగే కంపెనీ సిగ్నేచర్ డిజైన్ లాంగ్వేజ్‌ని ప్రతిబింబిస్తుంది. దీనితో పాటు, జీప్ కంపాస్ అండ్ గ్రాండ్ చెరోకీ SUV ఎన్నో ఎఫ్ఫెక్ట్స్ ఇందులో కనిపిస్తాయి. కానీ వాటితో పోల్చితే మెరిడియన్ చాలా ఆధునికమైన ఇంకా విలాసవంతమైన SUV అని కంపెనీ చెబుతోంది. భారతదేశంలో MG గ్లోస్టర్, స్కోడా కొడియాక్, టయోటా ఫార్చ్యూనర్ వంటి SUVలకు పోటీగా జీప్ మెరిడియన్ లాంచ్ చేసింది.
బుకింగ్ వివరాలు
కంపెనీ చాలా కాలం క్రితం జీప్ మెరిడియన్ SUVని బుకింగులు ప్రారంభించింది. ఈ SUVని కొనుగోలు చేయాలనుకునే వారు జీప్ డీలర్‌షిప్ వద్ద లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 50,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
లుక్ అండ్ డిజైన్ విషయానికి వస్తే ముందువైపు, మెరిడియన్ డ్యుయల్-ఫంక్షన్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఆకర్షణీయమైన బంపర్, LED ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన ఐకానిక్ సెవెన్-స్లాట్ గ్రిల్ ఉంటుంది.
సైడ్ ప్రొఫైల్‌కి వస్తే SUV బాడీ క్లాడింగ్, పనోరమిక్ సన్‌రూఫ్‌కు ఇరువైపులా ఇంటిగ్రేటెడ్ రూఫ్ రెయిల్‌లను పొందుతుంది. జీప్ కంపాస్ కంటే పెద్ద బ్యాక్ ఓవర్‌హ్యాండ్ అండ్ పెద్ద బ్యాక్ డోర్స్ పొందుతుంది. వెనుక వైపున, SUV LED టెయిల్‌లైట్‌లు, వెనుక వైపర్ అండ్ వాషర్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్‌ను పొందుతుంది. ఈ SUVకి 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
ఇంజిన్ అండ్ గేర్‌బాక్స్
జీప్ మెరిడియన్ 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. దీనిని కంపాస్ SUVలో కూడా అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ SUV ఫ్రంట్-వీల్ డ్రైవ్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ రెండింటినీ పొందుతుంది. ఫ్రంట్-వీల్-డ్రైవ్ (FWD), ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్‌లు 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఈ SUVలో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేదు.
డ్రైవ్ మోడ్ అండ్ స్పీడ్
మెరిడియన్ లో మూడు డ్రైవ్ మోడ్‌లు ఉంటాయి - స్నో, ఇసుక/మడ్ అండ్ ఆటో. ఈ SUV కేవలం 10.8 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు దీని టాప్ స్పీడ్ 198 kmph.
ఎస్‌యూవి సైజ్
జీప్ కొత్త SUV మెరిడియన్ సైజ్ గురించి మాట్లాడితే దాని పొడవు 4,769 ఎంఎం, వెడల్పు 1,858 ఎంఎం, పొడవు 1,698 ఎంఎం, 2,794 ఎంఎం వీల్‌బేస్ ఉంది. SUV బాడీని పొడిగించేందుకు వీల్‌బేస్ 158ఎంఎం పెరిగింది. జీప్ మెరిడియన్ 3-వరుస SUV జీప్ కంపాస్ SUVలో ఉపయోగించిన చిన్న వెడల్పు 4×4 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో లాంగ్ వీల్‌బేస్ SUVగా మార్చడానికి సవరించబడింది. మెరిడియన్ ఫార్చ్యూనర్ కంటే ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తోంది. కానీ టయోటా ఫార్చ్యూనర్ రోడ్డుపై జీప్ కంటే చాలా శక్తివంతమైనది.
విలాసవంతమైన ఫీచర్లు
ఈ SUV క్యాబిన్ జీప్ నుండి ప్రీమియంగా ఉంటుంది. ఈ 3-వరుసల SUVలో చాలా గొప్ప ఫీచర్లు ఇచ్చారు. జీప్ మెరిడియన్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. దీనితో పాటు, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ సీట్లు, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, 9-స్పీకర్ ఆల్పైన్ సోర్స్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భద్రతా ఫీచర్లు
జీప్ మెరిడియన్ 3 వరుసల సీటింగ్‌ను పొందుతుంది. అయితే చివరి వరుసలో పరిమిత స్థలం ఉంది. సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే, జీప్ మెరిడియన్‌లో 60కి పైగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. కొత్త జీప్ మెరిడియన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అండ్ డిసెంట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఇతర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. మెరిడియన్ SUV 3 వరుసలలో ప్రయాణించే వారికి బెస్ట్-క్లాస్ అనుభవాన్ని అందిస్తుందని జీప్ పేర్కొంది.