గతేడాది తారక్ లాంబోర్గిని ఉరుస్ (Lamborghini Urus) అనే కారుని కొనుగోలు చేశారట. మామూలుగా ఎన్టీఆర్‌కి స్పోర్ట్స్ కార్లంటే చాలా ఇష్టం. ఎంతో ముచ్చటపడి ఈ కారుని ఇంపోర్ట్ చేసి మరీ కొనుగోలు చేశారట. ఇటలీ నుంచి ఈ కారును దిగుమతి చేయిస్తున్నారని సమాచారం. ఈ సూపర్ స్పోర్ట్స్ కారు ఖరీదు 5 కోట్ల వరకు ఉంటుంది. మరి ఈ కారు విశేషాలేంటో తెలుసుకుందాం.
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీలో ప్రసిద్ధి చెందిన లంబోర్ఘిని తన ఉరుస్‌ను (Lamborghini Urus) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన SUV కారు, ఇది అంతర్జాతీయ మార్కెట్లతో పాటుగా, భారతదేశంలో ప్రవేశ పెట్టింది.
భారతదేశంలో ఈ కారు ధర రూ. 3 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంచబడింది. మొదటి ఏడాది 1000 యూనిట్ల లాంబోర్గినీ ఉరుస్‌ను తయారు చేయగా, వచ్చే ఏడాది 3500కు పెంచనున్నారు.
లంబోర్ఘిని ఉరస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన SUV కారు. ఇది కేవలం 3.6 సెకండ్ల వ్యవధిలో జీరో నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. 200 కిమీ వేగాన్ని అందుకోవడానికి కేవలం 12.8 సెకన్లు మాత్రమే పడుతుంది. కారు గరిష్ట వేగం గంటకు 305 కి.మీ.
ఈ కారులో 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్ కలదు. టర్బో ఇంజన్ కలిగిన మొదటి లంబోర్ఘిని కారు ఇదే. కారు ఇంజన్ 641 బిహెచ్‌పి పవర్ , 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
2012లో బీజింగ్ మోటార్ షోలో కంపెనీ ఈ కారును కాన్సెప్ట్‌గా పరిచయం చేసింది. ఆడి క్యూ7, బెంట్లీ బెంటేగా, పోర్షే కయెన్‌ల మాదిరిగానే ఈ కారును నిర్మించారు.