Nandamuri Balakrishna Car: బాలయ్య వాడే బెంట్లే కారు ధర ఎంతో తెలుసా...ఫీచర్లు చూస్తే వావ్ అంటారు...

First Published | May 20, 2022, 12:19 PM IST

Nandamuri Balakrishna Car: యువరత్న నందమూరి బాలకృష్ణ అంటేనే రాజసం ఉట్టిపడుతుంది. ఆయనకు రేసింగ్ కార్లు అంటే యమ మోజు, విదేశాల్లో ఆయన సూపర్ స్పీడుతో కార్లు నడుపుతారట, ఆ సంగతి ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే బాలయ్య దగ్గర చక్కటి కార్ కలెక్షన్ ఉంది. అందులో ఇటీవల చేరిన బెంట్లీ కాంటినెంటల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరి దాని ఫీచర్లు ధర సంగత ఏంటో తెలుసుకుందాం.

టాలివుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో అభిమానులు అలరిస్తున్నారు. రీసెంట్ గా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య, అటు  ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ టాక్ షో హోస్ట్ గా తొలిసీజన్ సూపర్ హిట్ చేసుకొని, తాజాగా గోపీచంద్ మలినేని చిత్రం NBK 107 షూటింగులో బిజీగా ఉన్నారు. 

బాలయ్య వాడుతున్న ఈ బెంట్లీ కాంటినెంటల్ GT లగ్జరీ కారు ధర రూ.3.30 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు ఉంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం 3.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 329 కి.మీ. కాంటినెంటల్ GT 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్లు ఆటోమేటిక్ గా పనిచేస్తాయి. 
 


అత్యంత శక్తివంతమైన ఇంజన్

బెంట్లీ కాంటినెంటల్ GT శక్తివంతమైన ఇంజన్ తో వస్తుంది. దీనికి 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 8 పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజిన్ 542 బిహెచ్‌పి (550 పిఎస్) శక్తిని, 568 (770 ఎన్ఎమ్) టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 
 

డిజైన్ అండ్ లుక్

కారు ముందు, వెనుక భాగంలోని  కొత్త  డిజైన్ ను అనుసరిస్తాయి. ఇది కారు విలాసవంతమైనదిగా  కనిపించేలా చేస్తాయి. ఈ కొత్త బెంట్లీ కారు మొదటిసారి డార్క్ టింట్ డైమండ్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్‌తో వస్తుంది. 

ఫీచర్స్

కారు లోపలి భాగంలో  కొత్త స్టైలిష్ సీట్లు అందించారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు వెనుక సీట్ వద్ద పెద్ద లెగ్‌రూమ్‌ వస్తుంది. ఈ కారులోని ఫీచర్స్ గురించి మాట్లాడితే  10.9-అంగుళాల స్క్రీన్‌తో నెక్స్ట్ జనరేషన్  ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సూపర్ హై-రిజల్యూషన్ గ్రాఫిక్స్, మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే  ఇప్పుడు ఈ కారులో స్టాండర్డ్ వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ ఆటో కూడా అందించారు. ఇవి కాకుండా ఈ లగ్జరీ కారులో పొందుపరిచిన సిమ్‌ను ఉపయోగించి మై బెంట్లీ కనెక్టెడ్ సర్వీస్  ఎక్స్టెండెడ్ సూట్ కూడా అందుబాటులో ఉంది. 
 

బెంట్లీ కాంటినెంటల్ GT 20 రంగులలో లభిస్తోంది.  ఆంత్రాసైట్ శాటిన్, బ్లాక్ క్రిస్టల్, ఒనిక్స్, టైటాన్ గ్రే, బ్లూ క్రిస్టల్, కింగ్‌ఫిషర్, మొరాకన్ బ్లూ, నెప్ట్యూన్, సీక్విన్ బ్లూ, బెంటెగా బ్రాంజ్, బ్రాంజ్, యాపిల్, Azuredium , కాండీ రెడ్, మెజెంటా, ఎక్స్‌ట్రీమ్ సిల్వర్, గ్రానైట్, గ్లేసియర్ వైట్, మొనాకో ఎల్లో లో లభిస్తోంది. 

కాంటినెంటల్ GT లంబోర్ఘిని హురాకాన్ ఎవో స్పైడర్, ఫెరారీ F8 ట్రిబ్యూటో, లంబోర్ఘిని హురాకాన్ ఎవో, ఫెరారీ రోమా, మెక్‌లారెన్ GT, మసెరటి MC20, బెంట్లీ బెంటాయ్‌గా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, ఆస్టన్ మార్టిన్ డిబి11తో పోటీ పడుతోంది.

Latest Videos

click me!