హ్యుందాయ్ కార్ల ధరలు మళ్ళీ పెంపు.. కొత్త ధర, ఫీచర్స్ పూర్తి వివరాలు తెలుసుకోండి..

First Published Apr 29, 2021, 3:50 PM IST

కొత్త ఆర్థిక సంవత్సరం నుండి  దేశంలోని వాహన తయారీ సంస్థలు వాహనాల ధరల పెంపును ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే తాజాగా దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ కార్లు కూడా భారత మార్కెట్లో ఖరీదైనవిగా మారాయి.

దీనికి సంబంధించి సంస్థ ఒక ప్రకటన కూడా చేసింది. దీంతో హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ సాంట్రో హ్యాచ్‌బ్యాక్ కారు నుండి అత్యధికంగా అమ్ముడైన క్రెటా ఎస్‌యూవీ కారు వరకు కంపెనీ అన్ని కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి. ధరల పెంపు తరువాత హ్యుందాయ్ చౌకైన కారు సాంట్రో పై సుమారు 8,000 రూపాయల అదనంగా చెల్లించాలి ఉంటుంది. సాంట్రో వేరియంట్ల ఆధారంగా ధరలు భిన్నంగా ఉంటాయి.
undefined
ఇంజన్ అండ్ మైలేజ్హ్యుందాయ్ సాంట్రోలో బిఎస్ -6 1086 సిసి 4-సిలిండర్ ఇంజన్‌ లభిస్తుంది. ఇది 5500 ఆర్‌పిఎమ్ వద్ద 68 హెచ్‌పి శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 99 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ఇంజన్ కి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందించారు. సాంట్రో బిఎస్ 6 కారు లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సిఎన్‌జి వేరియంట్‌ కిలోకు 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
undefined
ఆకర్షణీయమైన ఫీచర్స్సాంట్రో కారులో చాలా గొప్ప ఫీచర్లు అందించారు. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ అలాగే రియర్ సీట్ బెంచ్ ఫోల్డింగ్ సపోర్టింగ్, ఆపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ ఉన్నాయి.
undefined
భద్రత ఫీచర్స్ఈ కారు భద్రతా ఫీచర్స్ గురించి మాట్లాడితే డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), రియర్ పార్కింగ్ సెన్సార్స్, స్పీడ్ వార్నింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
undefined
ధర ఎంతంటే ?చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తి ఖర్చుల పెరుగుదలను పేర్కొంటూ వాటి వాహనాల ధరలను పెంచాయి. హ్యుందాయ్ సంస్థ కూడా వాహనాల ధరలను ఈ ఏడాదిలో రెండుసార్లు పెంచింది. అంతకుముందు కంపెనీ ఈ ఏడాది జనవరి నెలలో ధరలను పెంచింది. హ్యుందాయ్ ధరల పెరుగుదల ప్రకటించిన తరువాత, మీరు ఇప్పుడు సాంట్రో బేస్ వేరియంట్ ఎరా ఎక్సే కొనడానికి రూ .4.73 లక్షలు చెల్లించాలి. అంతకుముందు దీని ధర రూ .4.67 లక్షలు. అలాగే స్పోర్ట్జ్ వేరియంట్ ధర రూ .5.56 లక్షలు కాగా, ధరల పెరుగుదలకు ముందు దీని ధర రూ .5.50 లక్షల ఉంది. అంటే కంపెనీ ధరపై 6,000 రూపాయలు పెంచింది. సాంట్రో టాప్ మోడల్ అస్తా ఎఎమ్‌టి ధర ఇప్పుడు రూ .6.41 గా ఉంది, ఇంతకుముందు దీని ధర రూ .6.35 లక్షలు. అన్ని ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ చెందినవి.
undefined
సిఎన్‌జి వేరియంట్ కొత్త ధరహ్యుందాయ్ సాంట్రోని కంపెనీ అమర్చిన సిఎన్‌జి కిట్ ఆప్షన్‌తో కూడా విక్రయిస్తుంది. అలాగే సిఎన్‌జి వేరియంట్ల ధరను కూడా పెంచారు. సాంట్రో మాగ్నా సిఎన్‌జి వేరియంట్‌ ఇపుడు రూ .8 వేలు ఖరీదైనది, ఇప్పుడు దీని ధర రూ .5.93 లక్షలు. స్పోర్ట్జ్ సిఎన్‌జి వేరియంట్ ధర రూ .6.06 లక్షలు.
undefined
click me!