ఇండియాలో 10లక్షల కంటే తక్కువ ధరకే లభించే సురక్షితమైన కార్లు ఇవే.. వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి..

First Published Apr 28, 2021, 5:07 PM IST

2014లో  గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (జిఎన్‌సిఎపి) ఇండియాలో సురక్షితమైన వాహనాల విక్రయాలను ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో 'సేఫ్ కార్స్ ఫర్ ఇండియా' చొరవను ప్రవేశపెట్టింది. 

2014 నుండి 2020 మధ్య గ్లోబల్ ఎన్‌సిఎపి భారతదేశంలో తయారు చేసి నిర్మించిన 38 కార్ల నాణ్యత, భద్రతా పరిమాణాన్ని అంచనా వేయడానికి క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఇది భద్రతా ప్రమాణాలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశంలో సురక్షితమైన కార్లను తయారు చేయడానికి కార్ల తయారీదారులని ప్రేరేపించింది. ప్రస్తుతం భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ సురక్షితమైన కార్లను తయారు చేయడం ప్రారంభించింది. మీరు 10 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) లోపు కొనుగోలు చేయగల టాప్ 5 సురక్షితమైన కార్లు ఎంటివి, వాటి గురించి తెలుసుకోండి.
undefined
మహీంద్రా ఎక్స్‌యూ‌వి300ఈ రోజు భారత మార్కెట్లో లభించే మహీంద్రా కంపెనీ సురక్షితమైన కార్లలో ఎక్స్‌యూ‌వి300 సబ్ కాంపాక్ట్ ఒకటి. ఈ ఎస్‌యూ‌విని గత సంవత్సరం ప్రారంభంలో క్రాష్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో అడల్ట్స్ కి ఫుల్ ఫైవ్-స్టార్ రేటింగ్, పిల్లలకు 4-స్టార్ రేటింగ్‌ను లభించింది. అడల్ట్స్ భద్రత కోసం 17 లో 16.42 పాయింట్లు, పిల్లల భద్రత కోసం 49 పాయింట్లలో 37.44 పాయింట్లను ఈ కార్ సాధించింది. ఈ ఎస్‌యూ‌వి పెట్రోల్ ఇంకా డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది. దీనికి 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ , 1.5-లీటర్ ఆయిల్ బర్నర్ ఇంజన్ అందించారు. దీని ఇంజన్ కి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్, ఆప్షనల్ 6-స్పీడ్ ఏ‌ఎం‌టి గేర్‌బాక్స్ లభిస్తుంది.గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి రేటింగ్: 5-స్టార్ధరలు: 7.96 లక్షల నుండి 13.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ).
undefined
టాటా ఆల్ట్రోజ్గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ భద్రతా రేటింగ్ పొందిన నెక్సాన్ తరువాత భారతీయ కార్ల తయారీ సంస్థ నుండి టాటా ఆల్ట్రోజ్ రెండవ కారు. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు అడల్ట్స్ రక్షణ కోసం 17లో 16.13 స్కోరును సాధించింది, పిల్లల రక్షణ కోసం 49 పాయింట్లలో 29 పాయింట్లను సాధించింది, తద్వారా పిల్లల రక్షణలో 3-స్టార్ రేటింగ్ అందుకుంది. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, సీట్‌ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి స్టాండర్డ్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 3 ఇంజన్ ఆప్షన్స్ లో వస్తుంది - 1.2-లీటర్ రివోట్రాన్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోటోర్క్ డీజిల్. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో 5-స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్ గా ఉంటుంది.గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి రేటింగ్: 5-స్టార్ధరలు: 5.69 లక్షల నుండి 9.45 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢీల్లీ)
undefined
టాటా నెక్సాన్టాటా నెక్సాన్ గ్లోబల్ ఎన్‌సిఎపిలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా కారుగా నిలిచింది. గ్లోబల్ ఎన్‌సిఎపిలో 4 స్టార్ స్కోర్ పొందిన ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని 2018 ఆగస్టులో మొదటిసారి క్రాష్-టెస్ట్ చేశారు. డిసెంబర్ 2018లో జరిగిన రెండవ రౌండ్ క్రాష్ టెస్ట్ లో ఈ కారు చరిత్రను సృష్టించింది. అడల్ట్ ఆక్యుపెన్సీలో 17 లో 16.06 పాయింట్లను, చైల్డ్ ఆక్యుపెన్సీలో 49లో 25 పాయింట్లను సాధించింది. ఈ ఎస్‌యూవీ అన్ని వేరియంట్‌లలో రెండు ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ మౌంట్‌లు ఉన్నాయి. అలాగే ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో రెండిటిలో లభిస్తుంది. 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ 118 బిహెచ్‌పి, 170 ఎన్‌ఎమ్‌ ఉత్పత్తి చేస్తుంది, అయితే 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ రెవొటోర్క్ డీజిల్ 108 బిహెచ్‌పి, 260 ఎన్‌ఎమ్‌ అందిస్తుంది. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్‌, ఆప్షనల్ 6-స్పీడ్ AMTతో పొందుతాయి.గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి రేటింగ్: 5-స్టార్ధరలు: 7.09 లక్షల నుండి 12.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ)
undefined
టాటా టియాగో & టైగోర్టాటా మోటార్స్ కొత్త-జనరేషన్ కార్లలో భద్రతా ఎజెండాకు ప్రాధాన్యత ఇచ్చింది. గ్లోబల్ ఎన్‌సిఎపిలో టియాగో హ్యాచ్‌బ్యాక్, టైగర్ సబ్‌కాంపాక్ట్ సెడాన్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. భద్రతకు సంబంధించినంత వరకు నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇతర టాటా కార్లకు భారత కార్ల మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది. రెండు కార్లు అడల్ట్స్ రక్షణలో 17లో 12.72 పాయింట్లు, పిల్లల రక్షణ కోసం 49లో 34.15 పాయింట్లు సాధించాయి. ఈ రెండు కార్లు 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ తో వస్తాయి. 85 బిహెచ్‌పి, 113 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.గ్లోబల్ ఎన్‌సిఎపి రేటింగ్: టాటా టియాగో & టైగోర్ - 4-స్టార్స్ధరలు: టియాగో - 4.85 లక్షల నుండి 6.84 లక్షలు టైగోర్ - 5.49 లక్షల నుండి 7.63 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ)
undefined
వోక్స్వ్యాగన్ పోలోవోక్స్వ్యాగన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పోలో 2014లో టెస్ట్ చేయబడింది. ఈ కారుకు గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పిలో 4-స్టార్ రేటింగ్ లభించింది. అడల్ట్స్ ప్రయాణీకుల భద్రత కోసం 17లో 12.54 పాయింట్లను పొందింది. పిల్లల భద్రత కోసం 49లో కేవలం 29.91 పాయింట్లతో కేవలం రెండు స్టార్లను మాత్రమే సాధించింది. ఈ మోడల్ క్రాష్-టెస్ట్ చేసేటప్పుడు ఏ‌బి‌ఎస్, సీట్-బెల్ట్ రిమైండర్, చైల్డ్ ISOFIX మౌంట్స్ వంటి కొన్ని భద్రతా లక్షణాలు లేవు, కానీ ఇప్పుడు ప్రస్తుత మోడల్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ల వంటి స్టాండర్డ్ భద్రతా ఫీచర్స్ లోడ్ చేయబడింది. దీనికి 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్, 1.0-లీటర్ ఎంపిఐ పవర్ట్రెయిన్ ఆప్షన్లతో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ఆప్షన్స్ లభిస్తుంది.గ్లోబల్ ఎన్‌సిఎపి రేటింగ్: 4-స్టార్ధరలు: రూ.6.16 లక్షల నుండి 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
undefined
click me!