సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా.. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్నా టాప్ బెస్ట్ కార్స్ ఇవే..

First Published | Apr 29, 2021, 2:03 PM IST

కరోనా కారణంగా ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ ఊపందుకుంది. ఇండియన్ బ్లూ బుక్‌లో ప్రచురించిన రీసెర్చ్ ప్రకారం  2020 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో ప్రీ-ఔన్ద్  కార్ల అమ్మకాలు 4.2 మిలియన్ యూనిట్లు,  అంటే కొత్త కార్ల అమ్మకాలతో పోలిస్తే 50 శాతం ఎక్కువ.

కొత్త కార్ల అమ్మకాలు 2.8 మిలియన్ యూనిట్లుగా ఉంది. కోవిడ్-19 తరువాత ఈ ధోరణి పెరిగింది, ఎందుకంటే సామాజిక దూరం పాటించడం కోసం వాహనాల అవసరాన్ని పెంచింది. వాహన మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో కొన్ని ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్ గా కొనసాగుతున్నాయి. వాటిలో ఈ ఆరు టాప్ కార్ల గురించి మీకోసం...
మారుతి సుజుకి స్విఫ్ట్మారుతి సుజుకి స్విఫ్ట్ 2005లో ప్రారంభించినప్పటి నుండి భారతదేశంలో వాహనదారుల ఫస్ట్ ఛాయిస్ గా ఉంది. కొత్త లేదా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ రెండింటిలో ఈ ధోరణి ఒకే విధంగా ఉంది. గత 15 ఏళ్లలో మారుతి సుజుకి భారతదేశంలో మూడు తరాల స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. మీరు ఈ మూడింటినీ సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో కనుగొనవచ్చు. మీరు 2014 లేదా 2015 మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్ ని 3 లక్షల నుండి 4 లక్షల ధరకు పొందవచ్చు.

మారుతి సుజుకి ఆల్టోమారుతి సుజుకి ఆల్టో చాలా సంవత్సరాలుగా భారతీయ కుటుంబ కారుగా ఉంది. స్విఫ్ట్ లాగానే ఆల్టో కూడా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో గొప్ప డిమాండ్ ని సాధించింది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో ఇది కాంపాక్ట్ కారు, మంచి డ్రైవ్ ఇస్తుంది ఇంకా చాలా సరసమైనది కూడా. ఇప్పుడు మీరు కంపెనీ అమర్చిన సిఎన్జితో ఆల్టో మోడళ్లను పొందువచ్చు, సిటి రైడ్స్ కోసం చూస్తున్న వారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్. మీరు 2015 లేదా 2016 ఆల్టోను 2.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువకు కనుగొలు చేయవచ్చు.
మారుతి సుజుకి వాగన్ఆర్సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన మరో కారు మారుతి సుజుకి వాగన్ఆర్. స్విఫ్ట్, ఆల్టో తరువాత వాగన్ఆర్ కూడా కంపెనీ జాబితాలో అత్యధికంగా అమ్ముడైన వాటిలో ఒకటి. యూస్డ్ కార్ మార్కెట్లో కూడా ఈ ధోరణిని ప్రతిబింబించగలిగింది. జనాదరణ పొందిన వాడిన కార్ వెబ్‌సైట్ జాబితాలో ఈ కారు తప్పకుండ కనిపిస్తుంది. వాగన్ఆర్ భారతదేశంలో చాలా కాలం నుండి గో-టు టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ గా పేరొందింది. ఇప్పుడు ఇది కూడా కంపెనీ-అమర్చిన సిఎన్‌జి వ్యవస్థతో వస్తుంది. మీరు మంచి 2015 మోడల్ ని 3 లక్షలకు కనుగొలు చేయవచ్చు.
టయోటా ఇన్నోవామారుతి సుజుకి కార్స్ లాగానే టయోటా కార్లు కూడా అధిక రిసేల్ వాల్యు కలిగి ఉన్నాయి. ఇన్నోవా కొత్త కారు లేదా ఉపయోగించిన కారుగా కంపెనీ అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో ఒకటి. టయోటా ఇన్నోవా పెద్ద ఎమ్‌పివి కోసం చూస్తున్న ఎవరికైనా బెస్ట్ ఆప్షన్. నగరం లేదా రాష్ట్రాన్ని బట్టి మీరు మంచి ఇన్నోవాను సుమారు 7 లక్షల నుండి 10 లక్షలకు పొందవచ్చు.
హ్యుందాయ్ ఐ20హ్యుందాయ్ ఐ20 భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. నేటికీ దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో ఒకటిగా కొనసాగుతోంది. కొత్త అలాగే ఉపయోగించిన కార్లలో దీనికి డిమాండ్ ఇంకా కొనసాగుతోంది. ఈ కారు గొప్ప లుక్స్, శక్తివంతమైన ఇంజన్, గొప్ప లగ్జరీ అందిస్తుంది. ఈ రోజు మీరు మంచి హ్యుందాయ్ ఐ20ను 4 లక్షల నుండి 5 లక్షల మధ్య ఎక్కడైనా పొందవచ్చు.
హోండా సిటీహోండా సిటీ ఎల్లప్పుడూ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఒక బెంచ్ మార్క్. ఇది ఖచ్చితంగా ఉపయోగించిన కార్ల మార్కెట్లో కూడా ప్రసిద్ది చెందింది. అలాగే కంపెనీ దాదాపు 4 నుండి 5 సంవత్సరాలకు ఒక కొత్త-జెన్ మోడల్‌ను ప్రారంభించినందున, మీరు ఉపయోగించిన కార్ల మార్కెట్లో చాలా ఆకర్షణీయమైన ధర వద్ద ఇటీవలి హోండా సిటీని పొందవచ్చు. పాత తరం హోండా సిటీ టాప్-ఎండ్ మోడల్ 5 లక్షల నుండి 6.5 లక్షల మధ్య లభిస్తుంది, అంటే ఒక కొత్త మోడల్‌గా ఎక్స్-షోరూమ్ ధర కంటే 50 శాతం తక్కువ.

Latest Videos

click me!