అధిక మైలేజ్, పవర్ ఫుల్ ఇంజిన్ తో హ్యుందాయ్ ప్రీమియం ఎస్‌యూవీ.. దీని ధర, ప్రత్యేకతలేంటంటే ?

First Published | Apr 9, 2021, 1:01 PM IST

కార్ ప్రియులు ఎంతోగానో  ఎదురుచూతున్న  హ్యుందాయ్ కొత్త  కారుపై సస్పెన్స్ విడింది. దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ కంపెనీ నుండి రాబోతున్న కొత్త ఎస్‌యూవీ అల్కాజార్ ఫోటోలు, ఫీచర్లను అధికారికంగా విడుదల చేసింది. 

ఇప్పుడు హ్యుందాయ్ అల్కాజార్ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలోని టక్సన్, క్రెటా, వెన్యూలతో చేరింది. హ్యుందాయ్ ప్రత్యేకత ఏమిటంటే ఈ కారుతో కంపెనీ ఇండియాలో త్రీ-లైన్ సిటర్ విభాగంలోకి ప్రవేశించింది.
హ్యుందాయ్ అల్కాజర్ రెండు ఇంజన్ ఆప్షన్స్ లో అందిస్తున్నారు. వీటిలో మొదటిది 2-లీటర్ పెట్రోల్ ఇంజన్, రెండవది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ 159 పిఎస్, 191 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 115 పిఎస్, 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రెండు ఇంజన్లకు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందించారు. 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ముఖ్యంగా సూపర్ ఫ్లాట్ టార్క్ కన్వర్టర్ కారణంగా మెరుగైన పనితీరును, అధిక మైలేజీని ఇస్తుందని హ్యుందాయ్ పేర్కొంది.
హ్యుందాయ్ అల్కాజార్ ఫ్రంట్ స్ట్రట్‌లోని హైడ్రాలిక్ రీబౌండ్ స్టాపర్ మెరుగైన కంట్రోల్ ఇస్తుందని హ్యుందాయ్ పేర్కొంది. అలాగే గొప్ప రైడింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది. దీనిలో ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.
ఉన్నాయి. కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీలో అందించే ఫీచర్ల పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ కారులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇంకా మరెన్నో ఫీచర్లు అందిస్తున్నట్లు భావిస్తున్నారు.
హ్యుందాయ్ అల్కాజార్ 6 లేదా 7-సీట్ల కాన్ఫిగరేషన్లతో అందిస్తున్నారు. హ్యుందాయ్ ఈ విభాగంలో అతిపెద్ద వీల్‌బేస్‌తో వస్తుంది. ఈ వీల్‌బేస్ కారణంగా, మధ్య, చివరి వరుసలో ఉన్న ప్రయాణీకులకు అధిక స్థలం ఉంటుంది. మిడ్-లైన్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, స్లైడింగ్ సీట్లతో పాటు లేటెస్ట్ ఫీచర్లతో ఆల్కాజర్‌ను ప్రీమియం ఉత్పత్తిగా అందించాలని కంపెనీ భావిస్తోంది.
హ్యుందాయ్ అల్కాజార్ లాంచ్ తేదీ కంపెనీ అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ ఎస్‌యూవీని ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం తయారు చేసింది.

Latest Videos

click me!