బెస్ట్ ఫీచర్లు, అధిక మైలేజ్ ఇచ్చే 5 లక్షలలోపు ఉన్న బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే..

First Published Apr 7, 2021, 2:13 PM IST

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మంచి మైలేజీతో పాటు అద్భుతమైన పనితీరుతో తక్కువ ధరకే  లభించే కార్లపై వాహన కొనుగోలుదారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. 

ఈ హ్యాచ్‌బ్యాక్ కార్లలో కుటుంబం మొత్తం కలిసి ప్రయాణించవచ్చు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ కార్లు 5 లక్షల లోపే మీకు లభిస్తాయి. దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి నుండి రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, టాటా మోటార్స్ వరకు ఈ కార్లకు భారీ డిమాండ్ ఉంది. మీరు కూడా కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే, తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల గురించి తెలుసుకోండి...
undefined
టాటా టియాగోటాటా మోటార్స్ ఇటీవల టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో చాలా మార్పులు చేసి తీసుకొచ్చింది. అప్ డేట్ చేసిన టియాగో కారు పాత మోడల్ లాగానే 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. అయితే ఇప్పుడు బిఎస్ 6 ఇంధన ఉద్గారల స్టాండర్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 84ps శక్తిని, 113Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.ఈ కారుకు 5 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. ఈ కారు లీటరుకు 19.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. టాటా టియాగో కారులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. భద్రతా ఫీచర్స్ గురించి మాట్లాడితే టియాగోలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇబిడి అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి స్టాండర్డ్ గా అందిస్తున్నారు. ఢీల్లీలో టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ బేస్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ .4.85 లక్షల నుండి మొదలవుతుంది.
undefined
హ్యుందాయ్ సాన్ట్రోహ్యుందాయ్ ఇండియా కొద్ది రోజుల క్రితం బిఎస్ 6 ఇంధన ప్రమాణాలకి అనుగుణంగా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు హ్యుందాయ్ సాంట్రోను విడుదల చేసింది. ఈ విభాగంలో ఇతర కార్ల నుండి పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ సాంట్రో బిఎస్ 6లో చాలా మార్పులు చేసింది, అలాగే దాని ధర కూడా పెంచింది. హ్యుందాయ్ సాంట్రో బిఎస్ 6లో 1086 సిసి 4-సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఈ కారు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 68 హెచ్‌పి శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 99 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కార్ ఇంజిన్ కి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది.సాంట్రో కారులో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్, రియర్ సీట్ బెంచ్ ఫోల్డ్ వంటి ఫీచర్స్ ఇచ్చారు. భద్రతా ఫీచర్ల గురించి చూస్తే ఈ కారులో ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇబిడి, వెనుక పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా ఉంటాయి. సాంట్రో బిఎస్ 6 కారు లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. హ్యుందాయ్ సాంట్రో ఎక్స్-షోరూమ్ ధర రూ .4.67 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
undefined
మారుతి సెలెరియో5 లక్షల లోపు ఉన్న కార్లలో మారుతి సెలెరియో గొప్ప ఆప్షన్. మారుతి సెలెరియోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. దీని మైలేజ్ లీటరుకు 21.63 కిలోమీటర్లు. ఈ కారు సిఎన్‌జి వేరియంట్ కిలోకు 31.76 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఫీచర్స్ గురించి చూస్తే మారుతి సెలెరియోలో ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్‌బెల్ట్ రిమైండర్‌ల వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. అంటే, ఈ ఫీచర్లు కారు బేస్ వేరియంట్ల నుండి లభిస్తాయి. మారుతి సెలెరియో ప్రారంభ ధర రూ .4.41 లక్షలు.
undefined
మారుతి వాగన్ ఆర్మారుతి వాగన్ ఆర్ లో 1.0-లీటర్ ఇంకా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లో లభిస్తుంది. 1.0-ఇంజన్ లీటరుకు 21.79 కిలోమీటర్ల మైలేజీని, 1.2-లీటర్ ఇంజన్ లీటరుకు 20.52 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఆల్టో సిఎన్జి మోడల్ కిలోకు 32.52 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఫీచర్స్ పరంగా చూస్తే వాగన్ఆర్ లో ఎయిర్ బ్యాగ్స్, ఎబిఎస్, ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్, సెంట్రల్ లాకింగ్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందుతుంది. మారుతి వాగన్ ఆర్ ప్రారంభ ధర రూ .4.65 లక్షలు.
undefined
మారుతి ఇగ్నిస్మారుతి సబ్ కాంపాక్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఇగ్నిస్ కి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 82 బిహెచ్‌పి శక్తిని, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇగ్నిస్ లీటరుకు 20.89 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మారుతి నుండి వచ్చిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లో కొత్త 7-అంగుళాల టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ప్లే స్టూడియోను పొందుతుంది. భద్రతా ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈ కారులో హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్, కీ-లెఫ్ట్ రిమైండర్, చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్, సీట్‌బెల్ట్ రిమైండర్, ఇమ్మొబిలైజర్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఈ కారు ధర రూ .4.89 లక్షలు.
undefined
undefined
click me!