రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరల పెంపు.. ఏ మోడల్ పై ఎంత పెరిగిందంటే ?

First Published | Apr 6, 2021, 7:07 PM IST

 బైక్ రైడింగ్ ఔత్సాహికులకు బ్యాడ్ న్యూస్. ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ చెందిన అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్   క్లాసిక్ 350 ఇప్పుడు  మరింత  ఖరీదైనదిగా మారింది. మీకు ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను కొనలంటే ఇప్పుడు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. 

ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుండి వివిధ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరల పెంపును ప్రకటించాయి. ద్విచక్ర వాహన తయారీ సంస్థలైన హీరో మోటోకార్ప్, యమహా, హోండా వంటి కంపెనీలు కూడా వాహనాల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా చేరింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ప్రతి వేరియంట్ కొత్త ధర ఎంతో తెలుసుకోండి.
ఒక నివేదిక ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ బెస్ట్ సెల్లింగ్ బైక్ వేర్వేరు వేరియంట్ల ధరలను పెంచింది. ఇప్పుడు క్లాసిక్ 350 బైక్స్ పై 5,231 రూపాయల నుండి 5,992 రూపాయలకు పెంచింది. క్లాసిక్ 350 ఎంట్రీ లెవల్ మోడల్ స్టాండర్డ్ వేరియంట్ ధర పెరుగుదలకు ముందు రూ .1,67,235 నుండి రూ .1,72,446 గా చేరింది. అంటే ఈ వేరియంట్ ధరపై రూ .5,231 పెంచారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ వేరియంట్ కొత్త ధరలువేరియంట్లు కొత్త ధర పాత ధర ఎంత పెరిగిందంటేస్టాండర్డ్ 1,72,466 1,67,235 5,231క్లాసిక్ బ్లాక్ 1,80,880 1,75,405 5,475గన్మెటల్ గ్రే (స్పోక్ విల్స్ ) 1,82,825 1,77,294 5,531గన్‌మెటల్ గ్రే (అల్లాయ్ వీల్) 1,95,253 1,89,360 5,893సిగ్నల్స్ 1,91,693 1,85,902 5,791మాటేల్లో సిల్వర్ 1,95,253 1,89,360 5,893ఆరెంజ్ అంబర్ 1,95,253 1,89,360 5,893మాట్టే అండ్ క్రోమ్ 1,98,600 1,92,608 5,992
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రారంభించినప్పటి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఇది. ఈ బైక్ ధరను పెంచడంతో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. దీని అమ్మకాలు ఇప్పటికీ అధికంగా ఉన్నప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్ దీనిని కొత్త లుక్ లో కూడా విడుదల చేయబోతోంది. క్లాసిక్ 350 నెక్స్ట్ జనరేషన్ మోడల్ లో మెకానికల్ నుండి ఫీచర్స్, స్టైలింగ్ వరకు చాలా మార్పులను చూస్తుంది.
నెక్స్ట్ జనరేషన్ క్లాసిక్ 350 కొత్త జె ప్లాట్‌ఫాం ఆధారంగా ఉంటుంది. ఈ బైక్ సింగిల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌కు బదులుగా ట్విన్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ఈ ఫ్రేమ్‌ను గత ఏడాది నవంబర్‌లో లాంచ్ చేసిన మేటోర్ 350 లో కూడా ఉపయోగించారు. ఇది బైక్ నిర్వహణ, పనితీరును మునుపటి కంటే మెరుగ్గా చేసింది. ఈ బైక్‌లో కొత్త 348 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 19.2 హెచ్‌పి శక్తిని, 27 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి కొత్త 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ లభిస్తుంది.
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లో ఫ్యూయెల్ గేజ్, ఓడోమీటర్, టిప్పర్ నావిగేషన్ పాడ్ సమాచారం కోసం డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫీచర్లను ఆర్‌ఇ మేటోర్ 350 బైక్‌లో ఇచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ టిప్పర్ నావిగేషన్ సిస్టమ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేశాక టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ చూపుతుంది. ఈ బైక్ సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్) తో పాటు డ్యూయల్ ఛానల్ వేరియంట్లలో వస్తుంది. అదనంగా ట్యూబ్‌లెస్ టైర్లు రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.

Latest Videos

click me!