కారు ఇంజిన్ వద్ద ఉండేందుకు ఎలుకలు ఇష్టపడతాయి.. ఎందుకో తెలుసా? వాటిని తరిమికొట్టే ఉపాయాలేంటి?

Published : Nov 23, 2026, 02:39 PM IST

కారులోకి దూరే ఎలుకలు ఇంజిన్ భాగంలోని వైర్లు, ఇతర వస్తువులను కొరికేసి వేలల్లో నష్టం చేస్తుంటాయి. మరి ఎలుకల నుంచి కారును ఎలా కాపాడుకోవాలి? ఎలుకలు కొరికితే ఇన్సూరెన్స్ వస్తుందా? తదితర విషయాలను తెలుసుకోండి.

PREV
15
కారు ఇంజిన్‌లోకి ఎలుకలు ఎందుకు దూరతాయి?

కారును ఎక్కువ రోజులు ఒకేచోట పార్క్ చేస్తే, ఎలుకలు ఇంజిన్‌ను తమ అడ్డాగా మార్చుకుంటాయి. ముఖ్యంగా ఓపెన్ పార్కింగ్, చెత్తాచెదారం ఉన్న చోట, ఆహార వ్యర్థాలు ఉండే ప్రదేశాల్లో కారును పెడితే ఎలుకలు సులువుగా కారులోకి దూరతాయి. ఇంజిన్‌లోని వెచ్చదనం ఎలుకలకు అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఇలా కారులో తిష్టవేసే ఎలుకలు తమ పళ్ల ఎదుగుదలను కంట్రోల్ చేసుకోవడానికి ఏదో ఒకటి కొరుకుతూ ఉంటాయి. ఈ క్రమంలో కారు వైర్లు, ప్లాస్టిక్ కవర్లు, రబ్బర్ పైపులు డ్యామేజ్ అవుతుంటాయి.

కారులో ఏదో చిన్న వైర్‌ను కొరికితే పెద్ద నష్టం ఉండదని అనుకోవద్దు… డ్యామేజ్‌ను బట్టి నష్టం ఉంటుంది. ఎలుకలు ఎలక్ట్రికల్ వైర్లను కొరికితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యమైన సెన్సార్ల వైర్లను కత్తిరిస్తే డాష్ బోర్డులో వార్నింగ్ లైట్స్ వెలుగుతాయి. రబ్బర్ పైపులు డ్యామేజ్ అయితే కారులో నుంచి ఫ్లూయిడ్స్ లీక్ అవ్వచ్చు. మొత్తం వైరింగ్ హార్నెస్ డ్యామేజ్ అయితే లక్షల్లో ఖర్చు రావొచ్చు. ఏసీ, ఇతర ఎలక్ట్రానిక్ పార్ట్స్ పనిచేయవు.

25
ఎలుకలు కారును కొరికితే ఖర్చు ఎంత?

కేవలం ఒకే ఒక్క వైర్ డ్యామేజ్ అయితే వందల్లో ఖర్చు అవుతుంది. అదే వైరింగ్ హార్నెస్, సెన్సార్లు పాడైతే ఆ ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఆధునిక కార్లలో చాలా ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉంటున్నాయి. ఎక్కడో ఒకచోట ఎలుక వైర్ కొరికినా కారులోని ముఖ్యమైన సిస్టమ్స్ పనిచేయవు. కొన్నిసార్లు వైరింగ్ మొత్తం మార్చాల్సి వస్తుంది. అప్పుడు ఖర్చు రూ.వేలల్లో, రూ.లక్షల్లో కూడా అవ్వొచ్చు. కారు మోడల్‌ను బట్టి ఖర్చు మారుతుంది.

కారులో ఎలుకలు ఉన్నాయని ఎలా గుర్తించాలి?

ఎలుకలు కారు వైర్లను కొరికేదాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు కనిపిస్తే ముందే జాగ్రత్తపడొచ్చు. బానెట్ తీసినప్పుడు ఎలుకల మలం కనిపిస్తే కారులో ఎలుకలు ఉన్నట్లే. ఇంజిన్ దగ్గర పేపర్లు, వస్త్రాలు తెచ్చి పెట్టుకుంటే అనుమానించాల్సిందే. వైర్ల కవర్లు చిరిగిపోయి ఉన్నా, కారణం లేకుండా డాష్‌బోర్డులో వార్నింగ్ లైట్లు వెలిగినా, ఏసీ సరిగ్గా పనిచేయకపోయినా కారులో ఎలుకలు దూరినట్లే.

35
ఎలుకల నుంచి కారును కాపాడుకునే 8 మార్గాలు ఇవే

1. కారును ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలోనే పార్క్ చేయాలి. చెత్తకుప్పలు, ఆహార వ్యర్థాలు ఉన్న చోట పార్క్ చేయొద్దు.

2. కారు లోపల ఎలాంటి ఆహార పదార్థాలను ఉంచకూడదు. వాటి వాసనకు ఎలుకలు వస్తాయి.

3. కారు బానెట్ తీసి రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండాలి.

4. రాట్ రెపెల్లెంట్ (Rat Repellent) స్ప్రేలను వాడొచ్చు. కానీ వాటిని ఇంజిన్ దగ్గర, బ్యాటరీ దగ్గర వేయొద్దు.

5. కారు వైర్లకు ఎలుకలు కొరకకుండా ఉండే స్పెషల్ టేపులను వేయించండి.

6. కారు ఇంజిన్‌లోకి ఎలుకలు వెళ్లే మార్గాల్లో మెష్ (Mesh) వేయించొచ్చు.

7. కారును వాడకుండా రోజుల తరబడి ఒకే చోట ఉంచొద్దు.

8. పార్కింగ్ ప్లేస్‌లో ఎలుకలు ఎక్కువగా ఉంటే ఆ ప్లేస్‌ను మార్చేయండి.

45
ఎలుకలు కారు వైర్లు కొరికితే ఇన్సూరెన్స్ వస్తుందా?
ఇది చాలా మంది కారు ఓనర్లకు ఉండే సందేహం. కారు వైర్లను ఎలుకలు కొరికితే ఇన్సూరెన్స్ రావడం అనేది మీ పాలసీని బట్టి ఉంటుంది. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 'రాడెంట్ డ్యామేజ్' (Rodent Damage) యాడ్-ఆన్‌ను అందిస్తున్నాయి. బజాజ్ అలియాంజ్ లాంటి కంపెనీలు ఎలుకలు కొరికితే అయ్యే డ్యామేజ్‌కు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. అయితే అన్ని కాంప్రహెన్సివ్ పాలసీల్లో ఇది కవర్ అవ్వదు. కాబట్టి పాలసీ తీసుకునే ముందే చెక్ చేసుకోండి. ఒకవేళ డ్యామేజ్ జరిగితే ఫొటోలు తీసి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపండి.
55
ఎలుకలు కారును కొరికిన తర్వాత నడపొచ్చా?

కారులో ఏదైనా ముఖ్యమైన వైర్ కట్ అయిందని మీకు డౌట్ ఉంటే కారును స్టార్ట్ చేయొద్దు. ముఖ్యంగా కారు స్టార్ట్ చేయగానే ఏదైనా స్మెల్ వచ్చినా, డాష్‌బోర్డులో వార్నింగ్ లైట్లు వెలిగినా వెంటనే మెకానిక్‌ను పిలవండి. లోపల వైర్లు కట్ అయినప్పుడు కారును నడిపితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రాణాలకే ముప్పు.

కారు ఓనర్లు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం

పాత కార్లకే కాదు, కొత్త కార్లకు కూడా ఎలుకల నుంచి ముప్పు ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ కార్లలో ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డ్యామేజ్ జరిగితే ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. రాట్ స్ప్రేలు, టేపులు వేసినంత మాత్రాన 100% సేఫ్టీ దొరుకుతుందని గ్యారెంటీ లేదు. క్లీన్ పార్కింగ్, రెగ్యులర్ చెకప్, సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటేనే మీ కారుకు పూర్తి రక్షణ దొరుకుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories