Maruti Suzuki Offers: మారుతి సుజుకి కార్లపై రూ.1.40 లక్షల వరకు తగ్గింపు.. స్విఫ్ట్, ఆల్టో, వ్యాగన్ ఆర్‌, విక్టోరిస్ పై బంపర్ ఆఫర్లు

Published : Nov 23, 2026, 09:38 AM IST

Maruti Suzuki Offers: మారుతి సుజుకి కార్లపై బిగ్ ఆఫర్లు ప్రకటించింది. నవంబర్ 30 వరకు మారుతి సుజుకి అరేనా కార్లపై రూ.1.40 లక్షల దాకా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. విక్టోరిస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ ఆల్టో కార్ల పై ఉన్న ధరల వివరాలు మీకోసం.

PREV
15
మారుతి అరేనా భారీ ఆఫర్లు

నవంబర్ నెల ముగింపునకు వస్తోంది. ఈ టైమ్‌లో కొత్త కారు బుక్ చేసుకోవాలనుకునే వారికి మారుతి సుజుకి మంచి ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి అరేనా లైనప్‌లోని కార్లపై రూ.1.40 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. మారుతి విక్టోరిస్, స్విఫ్ట్, ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, ఈకో మోడళ్లపై ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.15,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.

25
మారుతి విక్టోరిస్ డిస్కౌంట్లు ఇలా ఉన్నాయి

మారుతి విక్టోరిస్ స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లపై మొత్తం రూ.1.40 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. పెట్రోల్ వేరియంట్లపై రూ.90,000, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.75,000 వరకు మొత్తం ప్రయోజనాలు ఉన్నాయి. రూ.20,000 కన్జ్యూమర్ ఆఫర్ కేవలం స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లకే ఉంది. పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లకు ఇది లేదు. మీ పాత కారు 10 ఏళ్ల లోపుదైతే, స్ట్రాంగ్-హైబ్రిడ్‌పై రూ.50,000 వరకు, పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ వస్తుంది. పాత కారు 10 ఏళ్లు దాటితే, ఈ బోనస్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌పై రూ.35,000 వరకు, పెట్రోల్, సీఎన్‌జీలపై రూ.15,000 వరకు తగ్గుతుంది.

మీ వద్ద హ్యుందాయ్ i10, హ్యుందాయ్ i20, టాటా నెక్సాన్, టాటా టియాగో లేదా మహీంద్రా XUV 3XO కారు ఉంటే, విక్టోరిస్ అన్ని వేరియంట్లపై అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఆ కారు వయస్సు 6 ఏళ్ల లోపు ఉంటే రూ.15,000 వరకు, 6 నుంచి 10 ఏళ్ల మధ్య ఉంటే రూ.10,000, 10 ఏళ్లు దాటితే రూ.5,000 వస్తుంది. ఇప్పటికే మారుతి కస్టమర్ అయితే, విక్టోరిస్ స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లపై రూ.30,000, సీఎన్‌జీ, పెట్రోల్ వేరియంట్లపై రూ.20,000 లాయల్టీ బోనస్ పొందవచ్చు. పాత కారును స్క్రాప్ చేస్తే స్ట్రాంగ్-హైబ్రిడ్‌పై రూ.45,000 వరకు, పెట్రోల్‌పై రూ.25,000, సీఎన్‌జీపై రూ.20,000 స్క్రాపేజ్ ప్రయోజనం ఉంది. మారుతి ఆమోదించిన కార్పొరేట్ సంస్థలో పనిచేసే వారికి స్ట్రాంగ్-హైబ్రిడ్, పెట్రోల్ వేరియంట్లపై రూ.15,000 కార్పొరేట్ బోనస్ లభిస్తుంది.

35
స్విఫ్ట్, ఆల్టో K10, ఎస్-ప్రెస్సో ఆఫర్లు

మారుతి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్లపై మొత్తం రూ.40,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. సీఎన్‌జీ వేరియంట్లపై మొత్తం రూ.25,000 వరకు ప్రయోజనాలు వస్తాయి. స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్లపై రూ.15,000 కన్జ్యూమర్ బెనిఫిట్ ఉంది, కానీ సీఎన్‌జీ వేరియంట్లపై ఈ కన్జ్యూమర్ బెనిఫిట్ లేదు.

ఇక ఆల్టో K10 పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌పై మొత్తం రూ.52,100 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ.47,100 వరకు, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.37,100 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. కన్జ్యూమర్ బెనిఫిట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్‌పై రూ.25,000, ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ.20,000, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.10,000 ఉంది. ఎస్-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్లపై రూ.37,100 వరకు, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.27,100 వరకు మొత్తం ప్రయోజనాలు ఉన్నాయి. ఎస్-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్లపై మాత్రమే రూ.10,000 కన్జ్యూమర్ బెనిఫిట్ లభిస్తుంది.

45
వ్యాగన్ ఆర్, సెలెరియో, ఈకో ప్రయోజనాలు

వ్యాగన్ ఆర్ 1.0-లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌పై మొత్తం రూ.62,100 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. 1.0-లీటర్ (AMT), 1.2-లీటర్ (MT), 1.2-లీటర్ (AMT) పెట్రోల్ వేరియంట్లపై రూ.57,100 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ వేరియంట్లపై రూ.47,100 వరకు మొత్తం ప్రయోజనాలు వస్తాయి. కన్జ్యూమర్ బెనిఫిట్ 1.0-లీటర్ పెట్రోల్ (MT)పై రూ.35,000 వరకు, ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ.30,000 వరకు, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.20,000 వరకు ఉంది.

సెలెరియో అన్ని వేరియంట్లపై మొత్తం రూ.47,100 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిపై రూ.20,000 వరకు కన్జ్యూమర్ బెనిఫిట్ లభిస్తుంది. ఈకో పెట్రోల్ వేరియంట్లపై మొత్తం రూ.42,100 వరకు, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.32,100 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. కన్జ్యూమర్ బెనిఫిట్ పెట్రోల్ వేరియంట్లపై రూ.15,000, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.5,000 వరకు ఉంది.

55
ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్, రూరల్ నిబంధనలు

స్విఫ్ట్, ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్-ఆర్, సెలెరియో, ఈకో పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లకు 10 ఏళ్ల లోపు కార్లపై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది. 10 ఏళ్లు దాటిన కార్లకు ఇది రూ.10,000 అవుతుంది. మీ కారు 6 ఏళ్ల లోపుదైతే, ఈ మోడళ్లపై రూ.10,000 స్మార్ట్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.

పాత కారును స్క్రాప్ చేయాలనుకుంటే, స్విఫ్ట్, ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్-ఆర్, సెలెరియో అన్ని వేరియంట్లపై రూ.10,000 స్క్రాపేజ్ బోనస్ వస్తుంది. మారుతి సుజుకి ఆమోదించిన కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వారికి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్-ఆర్, సెలెరియో వేరియంట్లపై రూ.2,100 కార్పొరేట్ బెనిఫిట్ ఉంది. రూరల్ ఏరియాలో కారు కొనే వారికి కూడా ఇదే మోడళ్ల అన్ని వేరియంట్లపై రూ.2,100 రూరల్ బెనిఫిట్ లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories