SP125' స్పోర్ట్స్ ఎడిషన్ పరిచయం దాని అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ ఇంకా థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ తో కస్టమర్‌లను ఉత్తేజపరిచింది. 125సీసీ ప్రీమియం ప్యాసింజర్ బైక్ విభాగంలో కొత్త 'SP125' స్పోర్ట్స్ ఎడిషన్‌ను విడుదల చేయడం మా కస్టమర్‌లను, ముఖ్యంగా యువ తరాన్ని మరింత ఆహ్లాదపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అని హోండా మోటార్‌సైకిల్ ఇండియా ప్రెసిడెంట్ సుట్సుము ఒటాని అన్నారు.
హోండా 'SP125' స్పోర్ట్స్ ఎడిషన్‌ను విడుదల చేయడంపై హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ, "హోండా 'SP125' స్పోర్ట్స్ ఎడిషన్‌ను విడుదల చేయడం మాకు ఆనందంగా ఉంది. దాని అద్భుతమైన లుక్ ఇంకా మోడ్రన్ ఎక్విప్మెంట్ తో మీకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. 'SP125' కొత్త స్పోర్ట్స్ వెర్షన్ కస్టమర్‌లలో పాపులర్ అప్షన్ గా మిగిలిపోతుంది. ఇంకా దాని విభాగంలో కొత్త ప్రమాణాలను సెట్ చేస్తుంది అని అన్నారు. దీని ఆకర్షణీయమైన ధర రూ. 90,567 (ఎక్స్-షోరూమ్).