ఈ రెండు ప్రీమియం వేరియంట్లు వివిధ మెరుగుదలతో నాలుగు కొత్త కలర్స్ అప్షన్స్ తో పరిచయం చేయబడుతున్నాయి. కొత్త జావా 42 డ్యూయల్ టోన్ ధర రూ. 1,98,142 నుండి ప్రారంభం కాగా, కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ ధర రూ. 2,08,829 నుండి ప్రారంభమవుతుంది. జావా 42 బైక్ రూ. 1,89,142 నుండి ప్రారంభం కాగా, యెజ్డీ రోడ్‌స్టర్ రూ. 2,06,142 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతాయి.
న్యూ జావా 42 డ్యూయల్ టోన్ - జావా 42 డ్యూయల్ టోన్ వేరియంట్ క్లియర్ లెన్స్ ఇండికేటర్, షార్ట్-హంగ్ ఫెండర్లు, కొత్త డింపుల్ ఫ్యూయల్ ట్యాంక్‌ను పొందుతుంది. వీటన్నింటికి అనుబంధంగా ప్రీమియం డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంకా ``కాస్మిక్ రాక్'', ``ఇన్ఫినిటీ బ్లాక్'', ``స్టార్‌షిప్ బ్లూ'' అండ్ ``సెల్స్టియల్ కాపర్''తో సహా ప్రీమియం డ్యూయల్ టోన్ కలర్స్ తో అందుబాటులో ఉంది. ఇంజన్ అండ్ ఎగ్జాస్ట్ యూనిట్‌లకు కలర్ కాంట్రాస్ట్‌ని మెరుగుపరచడానికి ``రావెన్ టెక్స్చర్'' ఫినిషింగ్ ఇవ్వబడింది. కొత్త స్పోర్టియర్ బ్యూటీకి సరిపోయేలా సీటు రీడిజైన్ చేయబడింది.
ఈ కొత్త వేరియంట్‌లో రీడిజైన్ చేయబడిన బాష్ ప్లేట్, కొత్త హ్యాండిల్ బార్ మౌంటెడ్ మిర్రర్స్ అండ్ కొత్త హ్యాండిల్ బార్ గ్రిప్స్ ఇచ్చారు. "జావా 42'' బైక్స్ 294.7cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 27.3PS అండ్ 26.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. పీక్ టార్క్ 5,750rpm. అలాగే హైవేపై దీని పర్ఫార్మెన్స్ అదుర్స్. దీనికి స్మూత్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ అండ్ సేఫ్టీ కోసం క్లాస్-లీడింగ్ `డ్యూయల్-ఛానల్` ABS ఉంది.
యెజ్డీ రోడ్‌స్టర్: కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ ఈ విభాగంలో పెద్ద మార్పులతో మరింత ఫ్రెండ్లీగా వస్తుంది. హైలెట్ మార్పులలో రివైజ్డ్ రైడర్ ఫుట్‌పెగ్‌లు (ఫార్వర్డ్ సెట్ 155 ఎంఎం), పొడవైన హ్యాండిల్ బార్ ఉన్నాయి. ఈ అప్‌డేట్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌కు బ్రాండ్ ప్రోయాక్టివ్ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఉన్న "రోడ్‌స్టర్'' తో పాటు విక్రయించబడుతుండటంతో, కస్టమర్‌లు ఇప్పుడు తమకు బాగా సరిపోయే బైక్ వెర్షన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
కొత్త జావా 42 లాగానే యెజ్డీ రోడ్‌స్టర్ కూడా కొన్ని డిజైన్ అప్‌డేట్స్ పొందుతుంది. వీటిలో స్పోర్టియర్‌గా కనిపించే మోకాలి బ్రేక్ స్ట్రిప్, ప్రీమియం డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఇంజన్, ఎగ్జాస్ట్‌పై ఫినిషింగ్ ఉంటాయి. దీనికి కొత్త హ్యాండిల్‌బార్ గ్రిప్స్, హ్యాండిల్‌బార్-మౌంటెడ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. దీనికి మరో ముఖ్యమైన కొత్త ఫీచర్స్ కొత్త "ఎగ్జాస్ట్‌లు''. కొత్త మోడల్ త్రి-టోన్, డ్యూయల్-టోన్ థీమ్‌తో సహా నాలుగు కొత్త కలర్స్ లో వస్తుంది, వీటిలో రష్ అవర్ రెడ్, ఫారెస్ట్ గ్రీన్ అండ్ లూనార్ వైట్ ఉన్నాయి.
"యెజ్డీ రోడ్‌స్టర్'' సిరీస్ 29.5 PS, 28.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 334 cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఇంకా క్లాస్-లీడింగ్ డ్యూయల్-ఛానల్ ABS అండ్ స్మూత్ హైవే క్రూజింగ్ కోసం లాంగ్ 1440 mm వీల్‌బేస్ ఉంది.