భారత్‌లో తక్కువ ధరలో లభించే కమ్యూటర్ బైకుల మార్కెట్‌లో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌కు మంచి పేరుంది. రోజూ ఆఫీసుకు, ఇతర పనులకు తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి కస్టమర్స్ కోసమే హీరో ఈ బైక్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ బైక్ ధర మరింత తగ్గింది… కొన్ని చోట్ల కేవలం రూ.59,999 ప్రత్యేక ధరకు అమ్ముతున్నట్లు సమాచారం. దీని ప్రారంభ ధర రూ.66,782గా ఉండేది… వివిధ ఆఫర్ల కింద ధర తగ్గించి అమ్ముతున్నారు.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ధరల తగ్గింపు బడ్జెట్ బైక్ కొనాలనుకునేవారి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ రూ.59,999 ధర దేశవ్యాప్తంగా అన్నిచోట్లా ఉండకపోవచ్చు. ఇది కేవలం పరిమిత కాల ఆఫర్ లేదా స్టాక్ ఉన్నంతవరకే కావచ్చు. కాబట్టి కొనేముందు మీ దగ్గర్లోని హీరో డీలర్‌ను సంప్రదించి అసలు ధర, ఆఫర్ వివరాలు, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి అదనపు ఖర్చుల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్స్-షోరూమ్ ధర వేరు, ఆన్-రోడ్ ధర వేరుగా ఉంటుంది.