Bikes : 350cc రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ రూ.1.38 లక్షలే.. రూ.2 లక్షల్లో వచ్చే టాప్ 5 బైక్స్ ఇవే

Published : Aug 10, 2026, 08:58 PM IST

350cc బైక్ అనగానే అందరికీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గుర్తొస్తుంది. కానీ మార్కెట్లో తక్కువ ధరలోనూ మంచి బైకులున్నాయి. కేవలం రూ.1.38 లక్షల ప్రారంభ ధరతో దొరికే బెస్ట్ 350cc బైకుల లిస్ట్ ఇదిగో. రోజూ ఆఫీసుకు, లాంగ్ రైడ్లకు కూడా ఇవి సూపర్.

PREV
15
తక్కువ ధరలో బెస్ట్ 350cc బైకులు
భారత్‌లో 350cc బైకులపై యువతకు క్రేజ్ బాగా పెరిగింది. రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికే కాదు, వీకెండ్స్‌లో లాంగ్ రైడ్స్ కోసం కూడా ఒకే బైక్‌ను వాడుతున్నారు. స్టైలిష్ లుక్‌తో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఈ బైకులు అందిస్తాయి. మైలేజ్, మెయింటెనెన్స్ కూడా పెద్ద తలనొప్పి లేకుండా చూసుకోవచ్చు.
25
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ సిటీ, లాంగ్ రైడ్లకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. క్లాసిక్ 350 అంత బరువుగా ఉండదు. తేలికగా, కాస్త చిన్నగా ఉండటంతో మహిళలు కూడా సులభంగా నడపొచ్చు. దీని ప్రారంభ ధర రూ.1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 36 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
35
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్లో క్లాసిక్ 350కి ఉన్న క్రేజే వేరు. అమ్మకాల్లో దీనిదే రికార్డ్. దీని ప్రారంభ ధర రూ.1.81 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ.2.16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. డైలీ యూజ్, లాంగ్ రైడ్స్.. ఇలా అన్నింటికీ ఇది బెస్ట్ ఛాయిస్. 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
45
హోండా హైనెస్ సీబీ 350 బైక్
హోండా హైనెస్ సీబీ 350 బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు గట్టి పోటీ ఇస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లో సంచలనం సృష్టించింది. దీని ప్రారంభ ధర రూ.1.93 లక్షలు, టాప్ మోడల్ ధర రూ.1.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్, వైబ్రేషన్-ఫ్రీ ఇంజిన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
55
రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త లుక్‌తో వచ్చిన బైక్ మీటియోర్ 350. దీని ధర రూ.1.96 లక్షల నుంచి రూ.2.16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ఇది 40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది ఒక క్రూయిజర్ టైప్ బైక్, చాలా రంగుల్లో అందుబాటులో ఉంది.
Read more Photos on
click me!

Recommended Stories