హీరో మోటోకార్ప్ 100 మిలియన్ ఎడిషన్ స్పెషల్.. ఈ కొత్త స్కూటిల ధర, కొత్త ఫీచర్స్, ప్రత్యేకతలు తెలుసుకోండి..

First Published Mar 19, 2021, 5:45 PM IST

ప్రపంచ వ్యాప్తంగా  బైకులు, స్కూటిలను తయారుచేసే అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్  హీరో డెస్టిని 125,  హీరో మాస్ట్రో 110 స్కూటీల 100 మిలియన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. హీరో స్కూటర్ లైనప్‌లోని ఈ రెండు స్కూటర్లు లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

హీరో స్కూటర్ లైనప్‌లోని ఈ రెండు స్కూటర్లు లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా హీరో మోటోకార్ప్ 100 మిలియన్ ఎడిషన్ ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్, స్ప్లెండర్ ప్లస్, పాషన్ ప్రో బైకులను కూడా విడుదల చేసింది.ఈ లిమిటెడ్ ఎడిషన్ బైకులను సింగిల్ వేరియంట్ అంటే ఎరుపు, తెలుపు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త కలర్ స్కీమ్‌లో స్కూటర్లు చాలా కొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. హీరో మోటోకార్ప్ 100 మిలియన్ ఎడిషన్ బ్యాడ్జ్‌లను స్కూటర్ ఆప్రాన్ ముందు ఉంచారు.
undefined
ఇంజన్ అండ్ పవర్హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్పెషల్ ఎడిషన్ స్కూటర్ స్టాండర్డ్ వేరియంట్ లాగానే ఇంజిన్‌ లభిస్తుంది. అంటే 110.9 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 8 హెచ్‌పి శక్తిని, 8.7 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. హీరో డెస్టిని 125కి 125 సిసి ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 8.7 బిహెచ్‌పి శక్తిని, 10.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
undefined
ధరహీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటి 100 మిలియన్ లిమిటెడ్ ఎడిషన్ ధర 65,250 రూపాయలు. 100 మిలియన్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫ్ డెస్టిని 125 ధర 72,250 రూపాయలు. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢీల్లీ.
undefined
హీరోస్ అచీవ్మెంట్హీరో మోటోకార్ప్ జనవరి నెలలో ఉత్పత్తిలో 100 మిలియన్ యూనిట్లను దాటి ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న కంపెనీ ప్లాంట్ నుంచి 10 మిలియన్ల ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ బైక్ ను తయారు చేశారు.హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఖ్యాతిని నిలుపుకున్న 20వ సంవత్సరం.
undefined
ఏప్రిల్ 2020 నుండి హీరో మోటోకార్ప్ 5 మిలియన్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసింది, ఆంటే 2019లో తయారు చేసిన 7.83 మిలియన్ల కంటే 15 శాతం తక్కువ. 2019లో కంపెనీ అత్యధికంగా ఉత్పత్తి చేసింది.
undefined
click me!