బిఎమ్‌డబ్ల్యూ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ వచ్చేసింది.. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే చాలు..

First Published Mar 18, 2021, 11:22 AM IST

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ  సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఎట్టకేలకు ఆల్-ఎలక్ట్రిక్ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ కారును వెల్లడించింది. బిఎమ్‌డబ్ల్యూ ఐ4 గ్రాన్ కూపే కారును బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ వార్షిక సమావేశంలో మొదట ప్రవేశపెట్టారు. అయితే, ఈ కారు  టెక్నికల్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ లాంచ్ చేసే సమయంలోనే కారు పూర్తి వివరాలు తెలుస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఒక ఫుల్ ఎలక్ట్రిక్ 4-డోర్ గ్రాన్ కూపే కారు, ఈ ఏడాది చివరిలోగా స్పోర్టి బిఎమ్‌డబ్ల్యూ ఎం పెర్ఫార్మెన్స్ వెర్షన్‌తో లాంచ్ అవుతుంది. విలేకరుల సమావేశంలో ప్రదర్శించిన కారు ప్రొడక్షన్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ నుండి విలక్షణమైన డిజైన్, రీసెట్ హ్యాండిల్, ఫ్రంట్ గ్రిల్ వంటి డిజైన్ అంశాలతో కనిపించింది.బిఎమ్‌డబ్ల్యూ ఐ4 మొత్తం మూడు పవర్ వెర్షన్లలో లభిస్తుందని బిఎమ్‌డబ్ల్యూ ధృవీకరించింది. ఇందులో ఇడ్రైవ్ 35, ఇడ్రైవ్ 40 (ఎక్స్‌క్లూజివ్ రియర్-వీల్ డ్రైవ్‌తో), రేంజ్-టాపింగ్ ఎం50 ఉన్నాయి.
undefined
మైలేజ్ అండ్ స్పీడ్డబల్యూ‌ఎల్‌టి‌పి సైకిల్ ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఒక ఫుల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌లోని ఇంజన్ గరిష్టంగా 530 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 4 సెకన్లలో అందుకోగలదు.
undefined
2022 బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ ఏడాది క్రితం సిఇఎస్ 2020లో ప్రవేశపెట్టిన కాన్సెప్ట్ వెర్షన్‌ల ఉంటుంది. ప్రస్తుత 3 అండ్ 4 సిరీస్ కార్లలో ఇచ్చిన గ్రిల్ సైజ్ కి చిన్న చిన్న మార్పులతో దాదాపు ఒకే విధమైన గ్రిల్ అందించారు.
undefined
బిఎమ్‌డబ్ల్యూ ఏ‌జి బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మెంబర్ పీటర్ మాట్లాడుతూ, "బిఎమ్‌డబ్ల్యూ ఐ4 దాని స్పోర్టి లుక్‌లతో కూడిన నిజమైన బిఎమ్‌డబ్ల్యూ, ఇది బెస్ట్ ఇన్ క్లాస్ డ్రైవింగ్ డైనమిక్స్ ఇంకా జీరో లోకల్ ఎమిషన్ లో ఉత్తమమైనది."అని అన్నారు.
undefined
కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐ4 జర్మన్ కార్ల తయారీ సంస్థ నుండి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు కానుంది. దీనితో పాటు సరికొత్త ఐడ్రైవ్ 8 టెక్నాలజీతో కూడిన మొదటి బిఎమ్‌డబ్ల్యూ మోడళ్లలో ఇది ఒకటి అవుతుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐ4 క్యాబిన్ లో 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ ప్లే, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
undefined
click me!