టెస్లాకి పోటీగా జనరల్ మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం చారిత్రక పెట్టుబడి ప్రకటన..

First Published | Jan 27, 2022, 5:56 AM IST

అమెరికన్ మల్టీనేషనల్ ఆటోమోటివ్ తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (GM) ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో వాటాను పెంచుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. ఈ రంగంలో ప్రస్తుతం టెస్లా (tesla) ఆధిపత్యంలో ఉంది. బహుశా టెస్లా నుండి ఆధిపత్య కిరీటాన్ని లాక్కోవడానికి  జనరల్ మోటార్స్ ఇటీవల యూ‌ఎస్ లోని మిచిగాన్ ప్లాంట్‌లో  7 బిలియన్ల (రూ. 524 బిలియన్లు)డాలర్ల రికార్డు స్థాయిలో భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలను తయారు చేయనుంది.

7 బిలియన్ల డాలర్ల చారిత్రాత్మక పెట్టుబడి
 జనరల్ మోటార్స్ చరిత్రలో ఈ పెట్టుబడి చారిత్రాత్మకమైంది.  దీని ద్వారా బ్యాటరీతో నడిచే వాహనాల ప్రస్తుత అలాగే భవిష్యత్తుపై అమెరికన్ కంపెనీ విశ్వాసాన్ని చూపుతుంది. 
 

ఈ‌వి రంగంలో లీడర్‌షిప్ కోసం ప్రణాళిక
జనరల్ మోటార్స్ సి‌ఈ‌ఓ మేరీ బర్రా మాట్లాడుతూ, "ఈ రోజు మేము యూ‌ఎస్ అలాగే ఉత్తర అమెరికా ఎలక్ట్రిక్ వాహనల ఉత్పత్తి ప్లాంట్‌లో బ్యాటరీ ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా  ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో లీడర్‌షిప్ స్థాపించడానికి  తదుపరి దశను తీసుకుంటున్నాము." అని అన్నారు.


జనరల్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అతిపెద్ద పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండాలని యోచిస్తోంది అలాగే ఈ దశాబ్దం మధ్య నాటికి యూ‌ఎస్ లో ఎలక్ట్రిక్ వాహనాల సెక్టార్‌ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లాలని  చేస్తోంది. ఉత్పత్తులు లాగే బ్యాటరీల అభివృద్ధి, ఉత్పత్తి కూడా అంతే ముఖ్యమైనవి అని అన్నారు.

కొత్త బ్యాటరీ ప్లాంట్
జనరల్ మోటర్స్  ఎల్‌జి ఎనర్జీ సొల్యూషన్స్‌తో  ఒప్పందం ఏర్పర్చుకుంది అలాగే  కొత్త బ్యాటరీ ప్లాంట్ కొన్ని నెలల్లో పని చేయనుంది. ఈ ప్లాంట్ ఇంకా ఎలక్ట్రిక్ వాహన తయారీకి సంబంధించిన ప్రత్యేక ప్లాంట్ దాదాపు రెండేళ్లలో పని చేయవచ్చని భావిస్తున్నారు.  ఓరియన్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్ కంపెనీకి ఎలక్ట్రిక్ పిక్-అప్ వాహనాలను తయారు చేయడంలో సహాయపడుతుంది,

అయితే లాన్సింగ్‌లోని ప్లాంట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుంది. లాన్సింగ్ ప్లాంట్ ఉత్తర అమెరికాలో దాని నాల్గవ బ్యాటరీ ప్లాంట్, తరువాత దశలో నాల్గవ ప్లాంట్‌ను నిర్మించాలని యోచిస్తోంది. మొదటి మూడు బ్యాటరీ ప్లాంట్లు లార్డ్‌స్టౌన్, ఒహియో, స్ప్రింగ్ హిల్, టెన్నెస్సీలో నిర్మించబడుతున్నాయి.

Latest Videos

click me!