పండగకి కొత్త కవాసకి బైక్.. పికప్, స్పీడ్, ఫీచర్స్ వావ్.. అక్టోబర్ నుంచి డెలివరీలు..

First Published | Sep 13, 2023, 11:33 AM IST

జాపనీస్ బ్రాండ్ కవాసకి  కొత్త ఇన్‌లైన్ 4-సిలిండర్ సూపర్‌స్పోర్ట్ మోడల్ నింజా ZX-4Rని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ హై-పర్ఫార్మెన్స్ గల ప్రీమియం బైక్ ఫుల్-బిల్ట్ యూనిట్‌గా భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ బైక్  కవాసకి ఇండియా  లైనప్‌లో నింజా 650 అండ్ నింజా 400 మధ్య ఉంటుంది.
 

పండుగ సీజన్‌తో పాటు అక్టోబర్ మొదటి వారంలో బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయని కవాసకి వెల్లడించింది. కవాసకి నింజా ZX-4R ప్రత్యేకమైన మెటాలిక్ స్పార్క్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ ఉన్న ప్రత్యేక వేరియంట్‌లో అందించబడుతుంది. కవాసకి భారతదేశ వారసత్వానికి అనుగుణంగా ఈ స్పోర్ట్స్ బైక్‌ను తయారు చేసింది. కవాసకి నింజా ZX-4R నింజా ZX-10R, Ninja ZX-6R వంటి అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది. 
 

నింజా ZX-4R 399 cc లిక్విడ్-కూల్డ్, 4 స్ట్రోక్, ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌తో స్లిప్పర్ క్లచ్ ఫీచర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ పవర్ ఫుల్ ఇంజన్ 14,500 rpm వద్ద 76 bhp మాక్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. అయితే 79 బిహెచ్‌పిని చేరుకోగలదు. 13,000 rpm వద్ద 39 Nm   అందిస్తుంది.  ఈ విభాగంలో అత్యంత పవర్ ఫుల్ 400 సిసి మోడల్.
 


సస్పెన్షన్ ముందు భాగంలో USD టెలిస్కోపిక్ ఫోర్క్ అండ్ వెనుక  మోనో షాక్ అబ్జార్బర్ ఉంటుందని. బైక్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో నిర్మించబడింది. 290 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, 220 mm బ్యాక్  డిస్క్ బ్రేక్ డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.  
 

నింజా ZX-4R డిజైన్‌లో నింజా ZX 10R బైక్‌ను పోలి ఉంటుంది. ఇందులో ఫ్రంట్ ట్విన్ ఎల్‌ఈడీ హెడ్ లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, సూపర్ బేరింగ్ డిజైన్, ఫ్రంట్ రామ్ ఎయిర్ ఇంటెక్ ఫెసిలిటీ, నింజా బైక్‌లకే ప్రత్యేకమైన షార్ప్ స్టైలింగ్ ఉన్నాయి. ఇంకా ఫుల్  డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్  స్పోర్ట్, రోడ్, రెయిన్ అండ్  రైడర్ వంటి ఇంటిగ్రేటెడ్ రైడింగ్ మోడ్‌లతో వస్తుంది.
 

నింజా ZX-4R సూపర్ స్పోర్ట్ మోడల్ బైక్‌లో 4.3 అంగుళాల TFT స్పీడోమీటర్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్, నావిగేషన్, ట్రాక్షన్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, సర్క్యూట్ మోడ్ మొదలైనవి ఉన్నాయి. భారతీయ మార్కెట్‌లో దీని ధర రూ.8,49,000 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)గా ఉంటుంది. అక్టోబర్ మొదటి వారంలో బైక్ డెలివరీ కూడా ప్రారంభం కానుందని సమాచారం.

Latest Videos

click me!