హ్యుందాయ్ లగ్జరీ బ్రాండ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి.. సింగిల్ ఛార్జ్‌తో 480 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్..

First Published | Aug 19, 2021, 5:27 PM IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్  విలాసవంతమైన వాహన విభాగం జెనెసిస్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యువి జెనెసిస్ జివి 60 డిజైన్‌ను ప్రవేశపెట్టింది. జెనెసిస్ అధికారికంగా ఈ ఏడాది చివరి నాటికి ఈ కారును లాంచ్ చేయనుంది. 

జి‌వి 60 అనేది జెనెసిస్  మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం. ఈ కారు హ్యుందాయ్ ఐ‌ఓ‌నిక్ 5, కియా ఈ‌వి6 ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే  గ్లోబల్-ఎలక్ట్రిక్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) పై ఆధారపడి ఉంటుంది. జి‌వి80, జి‌వి70 మోడళ్ల తర్వాత జి‌వి60 జెనెసిస్ నుండి వస్తున్న మూడవ ఎస్‌యూ‌వి.

జెనెసిస్ జివి60 800వి ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్ ద్వారా శక్తినిస్తుంది, 350kW వరకు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ కారు సింగిల్ లేదా డ్యూయల్ మోటార్ పవర్ ప్యాకేజీ వివిధ రకాల బ్యాటరీ సైజులతో సపోర్ట్ చేయగలదు. జివి60 జెనిసిస్ ఎస్‌యూ‌వి లైనప్‌లో జివి70 మరియు జివి80 కంటే కింద ఉంటుంది. జి80 సెడాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ తర్వాత ఈ కారు రెండో ఎలక్ట్రిక్ కారు అవుతుంది.

లుక్స్ అండ్ డిజైన్

జెనెసిస్ జివి60  సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్‌లను కొనసాగిస్తుంది.  షీల్డ్ ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా రెండు సిగ్నేచర్ క్వాడ్ హెడ్‌ల్యాంప్‌లు,  కంపెనీ లోగో  రీడిజైన్ వెర్షన్‌ చూపిస్తుంది. 
 


బ్యాక్ లుక్

జివి 60 ఎలక్ట్రిక్ ఎస్‌యువి వెనుకవైపు రూఫ్‌లైన్ ఫిక్స్డ్ వింగ్‌ను పొందుతుంది, అంటే కూపే కారు లాగా కనిపిస్తుంది. దీని పొడవైన క్లామ్‌షెల్ హుడ్ లో రైడ్ హైట్  కూపే తరహా లగ్జరీ క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్ రూపాన్ని ఇస్తుంది. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సైడ్ మిర్రర్స్ బయట అమర్చిన కెమెరాలను ఉపయోగించి రెండు స్క్రీన్‌లపై  ప్రొజెక్ట్ చేస్తాయి. 'క్రిస్టల్ స్పియర్' దాని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను నియంత్రిస్తుంది. కారు ఆపినప్పుడు ఆన్ అయ్యే ఇంటర్నల్ లైట్లు కూడా ఇందులో ఉన్నాయని జెనెసిస్ తెలిపింది. 
 

బ్యాటరీ అండ్ పవర్

 జి‌వి60  టెక్నికల్ వివరాలను జెనెసిస్ ఇంకా వెల్లడించలేదు, అయితే  ఐ‌ఓ‌నిక్ 5, ఈ‌వి6లకు సమానంగా ఉండే అవకాశం ఉంది. అంటే దీనిని 58kWh అండ్ 77.8kWh బ్యాటరీతో అందించవచ్చు. ఈ కారణంగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి 480 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వగలదు. బ్యాక్-వీల్-డ్రైవ్ సింగిల్-ఇంజన్ మోడల్  167హెచ్‌పి, 214హెచ్‌పి పవర్‌తో అందించే అవకాశం ఉంది, అయితే రెండు-ఇంజిన్లు 4-వీల్ డ్రైవ్ మోడల్ 301హెచ్‌పి ఉత్పత్తి  చేస్తుంది. 
 

ఫీచర్లు

కారు లోపలి గురించి మాట్లాడితే  జెనెసిస్ జి‌వి60 ఒక పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది, ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ రెండూ ఉన్నాయి. కనెక్ట్ చేసిన టెక్ అండ్ రియర్-వ్యూ కెమెరాల కోసం  రెండు స్క్రీన్‌లు ఉన్నాయి. కారులో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ప్రీమియం లెదర్ అప్‌హోల్స్టరీ, మూడ్ లైటింగ్ ఇంకా ఎన్నో ఇతర ఫీచర్లు పొందుతుంది. ఈ కారు లాంచ్ సమయంలో జి‌వి60 మైలేజ్, పర్ఫర్మెంస్, ధరల వివరాలను వెల్లడిస్తుందని జెనెసిస్ పేర్కొంది.
 

Latest Videos

click me!