దీపావళి ఆఫర్.. ఈ కారు కొంటే 5 లక్షల రూపాయలు ఆదా.. వీటిపై ఓ లుక్కేయండి..

First Published | Nov 6, 2023, 12:21 PM IST

దీపావళి పండగకి కస్టమర్లను ఆకర్షించేందుకు భారత ఆటోమొబైల్ రంగం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ పండుగ కోసం ఇప్పటికే కొన్ని సెలెక్ట్ చేసిన కార్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. మీరు ఈ  కార్లను కొనాలని ప్లాన్ చేస్తే, మీరు రూ. 5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
 

దీపావళి పండగకు కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. దీని ద్వారా అతధికంగా లాభం, ఎక్కువ సేవింగ్స్ తో   కస్టమర్లు కారు కలను నిజం చేసుకోవచ్చు.
 

టయోటా హిలక్స్ పికప్ ట్రక్కును కొనాలనుకునే  కస్టమర్లకు రూ.5 లక్షల ఆఫర్ లభిస్తుంది. Hilux ఎక్స్-షోరూమ్ ధర రూ. 30.40 లక్షల నుండి రూ. 37.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
 


మీరు మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారును కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ దీపావళికి మీకు రూ. 3 లక్షల ఆఫర్ లభిస్తుంది. XUV400 ఎలక్ట్రిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షల నుండి రూ. 19.19 లక్షల మధ్య ఉంటుంది.
 

CITROEN భారతదేశంలో సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు మార్కెట్‌ను విస్తరించేందుకు CITROEN C5 ఎయిర్‌క్రాస్‌ను కొనే కస్టమర్లకు రూ. 2.5 లక్షల ఆఫర్ లభిస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.36.91 లక్షల నుంచి రూ.37.67 లక్షలు.

ఎలక్ట్రిక్ కార్లలో MG ZS భారతదేశంలో డిమాండ్‌ను పొందింది. ఈ కారుపై రూ.2.3 లక్షల ఆఫర్ ప్రకటించింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.22.88 లక్షల నుంచి రూ.26 లక్షలు ఉంటుంది. 
 

ఈ దీపావళికి హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారును కొనే కస్టమర్లు రూ.2 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.23.84 లక్షల నుంచి రూ.24.03 లక్షలు ఉంటుంది.
 

జీప్ కార్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లో భారీ సందడి చేసింది. వీటిలో జీప్ మెరిడియన్ కారుపై దీపావళి పండుగ సందర్భంగా రూ.1.85 లక్షల ఆఫర్‌ను అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 33.40 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Latest Videos

click me!