దీపావళి ఆఫర్.. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేందుకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా.. అయితే ఇదిగో

First Published | Nov 4, 2023, 12:20 PM IST

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ పండుగ సీజన్‌లో కస్టమర్లక పలు ఆఫర్‌లను అందించింది. కంపెనీ చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ Ather 450s అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
 

ఈ దీపావళి సందర్భంగా కస్టమర్లను ఆహ్లాదపరిచేందుకు కంపెనీ కొన్ని ఆఫర్లను విడుదల చేసింది. ఇందులో భాగంగా కంపెనీ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450s పై రూ. 5000 అదనపు పండుగ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ విధంగా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.86050 వద్ద ఉంటుంది.
 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ ధర రూ. 1.32 లక్షలు కాగా, పండుగ ఆఫర్లు ఇంకా  కార్పొరేట్ డిస్కౌంట్ల తర్వాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఎక్స్-షోరూమ్ ధర రూ.86050. కంపెనీ పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలకు రూ.40,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ కూడా  అందిస్తోంది.
 


ట్రేడ్-ఇన్ వాల్యూ  కస్టమర్ బైక్ సంవత్సరం, కండీషన్, అసలు కొనుగోలు ధరపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎక్స్ఛేంజ్  వాల్యూని  కొత్త ఈథర్ స్కూటర్ కోసం డౌన్ పేమెంట్‌గా ఉపయోగించవచ్చు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆగస్టు 11న విడుదల చేసింది.
 

ఈ స్కూటర్‌పై కస్టమర్లు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 18 కంటే పైగా నావిగేషన్ పాయింట్‌లను పొందుతారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.32 లక్షలు. అయితే ఈ ధర  ఎక్స్-షోరూమ్ ధర అని  గమనించండి.
 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్  115 కి.మీ ప్రయాణిస్తుంది. ఏథర్ 450S బ్యాటరీ సామర్థ్యం 2.9 kWh. ఈ స్కూటర్  టాప్ స్పీడ్  గంటకు 90 కిలోమీటర్లు. ఈ స్కూటర్ ఒక ఛార్జ్ పై 105 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ 3.3 సెకన్లలో 0-40 kmph స్పీడ్  అందుకోగలదు.
 

Latest Videos

click me!