వావ్ ! హ్యుందాయ్ క్రెటా కంటే కాస్ట్లీ బైక్‌ను లాంచ్ చేసిన హోండా.. అడ్వెంచర్ లవర్స్ కోసం బుకింగ్స్ ఓపెన్...

First Published | Nov 1, 2023, 4:59 PM IST

జపనీస్ ప్రముఖ ద్విచక్ర వాహన బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన అడ్వెంచర్ టూరర్ XL750 Transalpని ఇండియాలో  లాంచ్  చేసింది. హోండా   లేటెస్ట్ ప్రీమియం అడ్వెంచర్ బైక్  XL750 Transalp 1980ల నాటి అసలైన  Transalp నుండి ప్రేరణ పొందింది.

ఈ బైక్  పూర్తిగా జపాన్‌లో తయారు చేయబడింది. ప్రీమియం బిగ్‌వింగ్ టాప్ లైన్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే విక్రయం ఉంటుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.

కొత్త మోడల్ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).  రెండు కలర్స్ లో లభిస్తుంది - రోజ్ వైట్ ఇంకా  మాట్ బాలిస్టిక్ బ్లాక్. బుకింగ్‌లు ఇప్పుడు కొచ్చి (కేరళ), గురుగ్రామ్ (హర్యానా), ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), హైదరాబాద్ (తెలంగాణ), చెన్నై (తమిళనాడు), కోల్‌కతాలోని(పశ్చిమ బెంగాల్) HMSI ప్రత్యేకమైన బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. మొదటి 100 బుకింగ్‌లు మాత్రమే అంగీకరించబడతాయి. నవంబర్ 2023 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి.

కొత్త అడ్వెంచర్ టూరింగ్ బైక్‌లో 5.0-అంగుళాల TFT ప్యానెల్ ఇచ్చారు, దీనిలో  స్పీడోమీటర్, టాకోమీటర్, గేర్-పొజిషన్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్ అండ్  రైడింగ్ మోడ్‌లు, ఇంజిన్ పారామీటర్‌లు ఇంకా  మరిన్నింటిని చూషిస్తుంది. ఈ డిస్‌ప్లేను రైడర్ ప్రాధాన్యత ప్రకారం కూడా కస్టమైజ్ చేయవచ్చు. కొత్త మోడల్‌లో హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్, స్టాప్ అండ్ టర్న్ సిగ్నల్ క్యాన్సిలింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హోండా XL750 Transalp కంపెనీ   కొత్త 755cc లిక్విడ్ కూల్డ్ 270 డిగ్రీ క్రాంక్ ఇన్‌లైన్ టూ సిలిండర్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజన్ 67.5kW పవర్,  75Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. థొరెటల్-బై-వైర్ సిస్టమ్, ABS, అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ద్వారా  ఎలక్ట్రానిక్ ఆపరేటేడ్ ఇంజిన్ పవర్, ఇంజన్ బ్రేకింగ్,  హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ కావలసిన కలయిక కోసం రైడర్ ఐదు రైడింగ్ మోడ్స్  సెలెక్ట్  చేసుకోవచ్చు.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సిఇఒ సుత్సుము ఒటాని మాట్లాడుతూ, “భారతదేశంలో సరికొత్త XL750 ట్రాన్‌సల్ప్‌ను పరిచయం చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడ్వెంచర్  ప్రియుల హృదయాలను గెలుచుకున్న హోండా ఎక్స్‌ఎల్ 750 ట్రాన్సల్ప్ భారతదేశంలోని కస్టమర్లను తప్పకుండా ఉత్తేజపరుస్తుందని  అన్నారు. స్పెషల్  బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌లలో బుకింగ్ ప్రారంభించిన కొత్త ఎక్స్‌ఎల్ 750 ట్రాన్సల్పైన్ డెలివరీలు త్వరలోనే      ప్రారంభమవుతాయని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ తెలిపారు.

Latest Videos

click me!