షాకింగ్ సేల్స్‌.. ఒక్క నెలలో 4.34 లక్షల బైక్స్ విక్రయించిన ద్విచక్ర వాహన సంస్థ!

First Published Nov 3, 2023, 12:31 PM IST

టీవీఎస్ మోటార్ అక్టోబర్‌లో అత్యధిక ప్రతినెలా  విక్రయాలను నమోదు చేసింది. అక్టోబర్‌లో కంపెనీ రికార్డు స్థాయిలో సేల్స్  నమోదు చేసి 4.34 లక్షల బైక్‌లను విక్రయించింది. ఈ సేల్స్ కంపెనీ అత్యధిక మంథ్లి అమ్మకాలు.
 

అంతకుముందు సంవత్సరంలో విక్రయించిన 3,60,288 యూనిట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి కనబరించింది. అక్టోబర్ 2022లో విక్రయించిన 344,630 యూనిట్లతో పోలిస్తే 2022 అక్టోబర్‌లో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22 శాతం పెరిగి 420,610 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాలు అక్టోబర్‌లో 25 శాతం పెరిగి 344,957 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఈ అమ్మకాలు  275,934 యూనిట్లుగా ఉంది.
 

మోటార్ సైకిల్(బైక్స్) విక్రయాలు గతేడాది 1,64,568 యూనిట్ల నుంచి 2,01,965 యూనిట్లకు పెరిగాయి. దింతో 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. స్కూటర్ విక్రయాల్లో 22 శాతం వృద్ధి నమోదైంది. అక్టోబర్ 2022లో 1,35,190 యూనిట్ల నుండి గత నెలలో అమ్మకాలు 1,65,135 యూనిట్లకు పెరిగాయి.
 

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు గత నెలలో 20,153 యూనిట్లుగా ఉన్నాయి. అక్టోబర్ 2022లో 8,103 యూనిట్లు విక్రయించాయి. అక్టోబర్ 2022లో 15,658 యూనిట్లతో పోలిస్తే కంపెనీ మూడు చక్రాల వాహనాల విక్రయాలు గత నెలలో 14,104 యూనిట్లుగా ఉన్నాయి.

ఎగుమతుల పరంగా కంపెనీ 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే నెలలో 82,816 యూనిట్లు ఉన్న ఎగుమతులు 2023 అక్టోబర్‌లో 87,952 యూనిట్లకు పెరిగాయి. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 10% వృద్ధిని నమోదు చేశాయి. ఎగుమతులు అక్టోబర్ 2022లో 68,696 యూనిట్ల నుంచి గత నెలలో 75,653 యూనిట్లకు పెరిగాయి.

Latest Videos

click me!