దీపావళి బంపర్ ఆఫర్.. మారుతీ స్విఫ్ట్, సెలెరియో సహా ఈ కార్లపై భారీ డిస్కౌంట్..! కొద్దిరోజులే ఛాన్స్..

First Published | Nov 8, 2023, 12:21 PM IST

మారుతీ సుజుకీ దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. మారుతీ సుజుకి ఎరీనా మోడల్స్‌పై గరిష్టంగా రూ.59,000 తగ్గింపును అందిస్తుంది.  

దీపావళి పండుగకు ఆటోమొబైల్ కంపెనీలు ఒక్కొక్కటిగా డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు మారుతీ సుజుకీ వంతు వచ్చింది. మారుతి సుజుకి ఎరీనా మోడళ్లపై భారీ తగ్గింపు ప్రకటించింది.

మారుతి సుజుకి అరేనా మోడల్స్ కార్లపై డిస్కౌంట్ ఆఫర్ నవంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీపావళి పండుగకు ఈ అఫర్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్.

మారుతి సుజుకి ఎస్ప్రెస్సో కారుపై మొత్తం రూ.54,000 తగ్గింపును ప్రకటించింది. 30,000 క్యాష్  డిస్కౌంట్, 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా  4,000 రూపాయల కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.

మారుతి సుజుకి సెలెరియోపై మొత్తం రూ.59,000 తగ్గింపును ప్రకటించారు. ఇందులో 35,000 క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. సెలెరియా ధర రూ. 5.37 లక్షల నుండి రూ. 7.14 లక్షలు (ఎక్స్-షోరూమ్).
 


మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పై మొత్తం రూ.49,000 తగ్గింపు ఇస్తున్నారు. రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. వ్యాగన్ ధర రూ. 5.54 లక్షల నుండి రూ. 7.42 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతి సుజుకి స్విఫ్ట్ కారుపై మొత్తం రూ.49,000 తగ్గింపు ఇస్తుంది. స్విఫ్ట్ ధర రూ. 5.99 లక్షల నుండి రూ. 9.03 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతి సుజుకి ఆల్టోకె10 కారుపై మొత్తం రూ.49,000 తగ్గింపు ఇవ్వబడింది. రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్ అండ్  రూ. 4,000 కార్పొరేట్ బోనస్ అందించబడతాయి.

ఆల్టో 800పై రూ.15,000, మారుతి ఎకోపై రూ.29,000, మారుతి సుజుకి డిజైర్‌పై రూ.10,000 తగ్గింపు ఉన్నాయి. ఆఫర్‌ పూర్తి వివరాల కోసం  సమీపంలోని మారుతీ సుజుకి అరేనా డీలర్‌ను సంప్రదించవచ్చు.

Latest Videos

click me!