మళ్ళీ చూడలేమేమో .. ఆరు లక్షల మంది కొన్న లెజెండ్రీ కారు.. ఉత్పత్తి ఆపేసిన కంపెనీ..

First Published | Dec 2, 2023, 12:27 PM IST

జర్మన్ వాహన తయారీ సంస్థ ఆడి TT స్పోర్ట్స్ కూపే ఉత్పత్తిని అధికారికంగా నిలిపివేసింది. కంపెనీ ఈ కారును తొలిసారిగా 1998లో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వచ్చిన 25 సంవత్సరాలలో కంపెనీ ఆడి టిటి స్పోర్ట్స్ కూపే 6,62,762 యూనిట్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించింది. ఆడి TTS కూపే అనేది  క్రోమ్ మ్యాట్ యాక్సెంట్‌లతో క్రోనోస్ గ్రే మెటాలిక్ పెయింట్‌లో అసెంబ్లింగ్ లైన్ నుండి రోల్ చేసిన చివరి మోడల్.

లేటెస్ట్ ఆడి TTS క్రోనోస్ గ్రే మెటాలిక్ కలర్‌లో ఫినిషింగ్ చేయబడి అలాగే డార్క్ క్రోమ్ మ్యాట్ యాక్సెంట్‌లను పొందుతుంది. మూడవ జానరేషన్ ఆడి TTS 2.0-లీటర్, TFSI, 4-సిలిండర్ ఇంజన్‌తో 306bhpని క్రాంక్ చేస్తుంది. కేవలం 4.5 సెకన్లలో సున్నా నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు. MQB ప్లాట్‌ఫారమ్ ఆధారంగా 2.5-లీటర్, 5-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించే పర్ఫార్మెన్స్-సెంట్రలైజెడ్ RS తర్వాత రెండవ అత్యంత శక్తివంతమైన మోడల్.
 

25 సంవత్సరాలలో ఈ జర్మన్ బ్రాండ్ మూడు తరాల TTని విడుదల చేసింది.  ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌లు, స్పెషల్ అండ్ ఫైనల్ వెర్షన్‌లు ఇంకా కూపే అలాగే  కన్వర్టిబుల్ అనే రెండు బాడీ స్టైల్‌లను పొందుతుంది. ఆడి TT 1995 టోక్యో మోటార్ షోలో కాన్సెప్ట్ రూపంలో మొదటిసారి ప్రదర్శించారు. చివరి వెర్షన్‌ను TT రోడ్‌స్టర్ ఫైనల్ ఎడిషన్ అంటారు. ఈ కార్ కన్వర్టిబుల్ అండ్ కేవలం 50 కార్లను మాత్రమే ఉత్పత్తి చేసారు. వాటిని యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే విక్రయించారు. హంగేరిలోని బ్రాండ్  గ్యోర్ ప్లాంట్‌లో చివరి యూనిట్ తో ఉత్పత్తి  నిలిపివేసింది. 
 


2.0-లీటర్ TFSI, 4-సిలిండర్, గ్యాసోలిన్ మిల్లుతో వస్తుంది, 315 bhp శక్తిని అండ్  400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో అందించారు, బ్రాండ్ క్వాట్రో AWD సిస్టమ్ ద్వారా అన్ని 4-వీల్స్ కి శక్తిని పంపుతుంది.

 ఆడి ఇండియా ఇటీవల మొత్తం పోర్ట్‌ఫోలియోలో రెండు శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది. ఇన్‌పుట్  అండ్ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఈ చర్య తీసుకున్నట్లు కార్ల తయారీదారులు చెబుతున్నారు. ఈ ధరల పెంపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. 

Latest Videos

click me!