చలికాలంలో కార్ లేదా బైక్ మైలేజీని ఎలా పెంచుకోవాలి.. ఈ 5 ఈజీ టిప్స్ ప్రయత్నించండి..

First Published | Dec 2, 2023, 10:42 AM IST

  చలికాలం వచ్చేసింది, రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చల్లని వాతావరణానికి సిద్ధం కావడానికి మన దుస్తులు ఇంకా అలవాట్లలో మార్పులు చేయడంతో పాటు, మన కార్లను మెయింటైన్ చేయడానికి  కొన్ని సాధారణ స్టెప్స్ కూడా అనుసరించవచ్చు. ఈ చలి కాలంలో మీ కారును మెయింటెయిన్ చేయడంలో ఇంకా  ఎక్కువా మైలేజీని అందించడంలో మీకు సహాయపడే 5 సులభమైన టిప్స్ ఉన్నాయి..
 

టైర్  ప్రెజర్ 
మైలేజీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం తరచుగా విస్మరించబడుతుంది, అదే టైర్ ప్రెజర్(tyre air pressure). ఉష్ణోగ్రతలు పడిపోతున్నప్పుడు, టైర్ ప్రెజర్  పడిపోతుంది, దీని వల్ల ఫ్యూయల్  సిస్టం  ప్రభావితం చేస్తుంది. తయారీదారుల సిఫార్సుల ప్రకారం మీ టైర్ ప్రెజర్ క్రమం తప్పకుండా చెక్ చేయండి అండ్  మెయింటైన్ చేయండి. తగినంత  గాలి ప్రెజర్ మంచి మైలేజీని అందించడమే కాకుండా చల్లని రోడ్లు, మంచు రోడ్లపై కూడా పట్టును పెంచుతుంది.
 

మీ డ్రైవింగ్ అలవాట్లను
శీతాకాలంలో, ఫాస్ట్ డ్రైవింగ్ ముఖ్యంగా మైలేజీకి హానికరం. అనవసరమైన స్పీడ్ కాకుండా   ఎకానమీ స్పీడ్ పాటించండి. అకస్మాత్తుగా ఆగి, హై   స్పీడ్ తో స్టార్ట్ చేయడం ఎక్కువ ఇంధనం వినియోగిస్తుంది. ఇంకా  మీ వాహనంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. సాఫ్ట్ డ్రైవింగ్ స్టయిల్ మెరుగైన మైలేజీకి గణనీయంగా దోహదపడుతుంది.
 


ఇంజిన్ వేడెక్కడం
మీ కారుతో రోడ్డుపైకి వచ్చే ముందు ఇంజన్ హీట్ చేయడం మంచిది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మోడ్రన్   ఇంజిన్లు మరింత సమర్థవంతంగా వేడెక్కుతాయి. ఐడిల్  సమయాన్ని లిమిట్  చేయండి, ఇంజిన్ దాని ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు మొదటి కొన్ని నిమిషాలు నెమ్మదిగా డ్రైవ్ చేయండి. ఈ విధానం ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా మీ ఇంజన్‌ లైఫ్ పెంచుతుంది.
 

సరైన ఆయిల్ ఎంచుకోండి:
చలికాలపు  వాతావరణం కోసం సరైన ఇంజిన్ ఆయిల్‌ను ఎంచుకోవడం మైలేజీపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మందపాటి ఆయిల్  రెసిస్టెన్స్ పెంచుతుంది. మీ వాహనం  మాన్యువల్‌ ప్రకారం   వింటర్-గ్రేడ్ ఆయిల్‌కి మారండి. దీనివల్ల  ఇంజిన్ పనితీరును పెంచుతుంది ఇంకా  మంచి మైలేజీకి దోహదం చేస్తుంది.

అదనపు బరువును
మీ వాహనంలో అనవసరమైన బరువును పెట్టడం వల్ల కూడా ఇంధన వినియోగం పెరుగుతుంది. మీ కారును నిర్వహించడానికి కొంత సమయం కేటాయించండి. మీకు అవసరం లేని వాటిని, ముఖ్యంగా భారీ వస్తువులను తీసివేయండి. అదనపు బరువు ఉంటె  మీ ఇంజిన్‌కి ఎక్కువ పని. దీని వల్ల మైలేజీ తగ్గుతుంది. తక్కువ  లోడ్ మంచి మైలేజీకి సహాయపడుతుంది.  

ఈ  టిప్స్ పాటించడం వల్ల శీతాకాలంలో మీ కారు ఇంధన సామర్థ్యానికి నిజమైన తేడా ఉంటుంది. టైర్ గాలి, డ్రైవింగ్ అలవాట్లు, ఇంజిన్ వార్మప్ పద్ధతులు, ఆయిల్ సెలేషన్, ఎక్కువ  బరువును తగ్గించడం ద్వారా మీరు శీతాకాలపు సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీరు మీ పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు.  

Latest Videos

click me!