ఎన్నో అప్షన్స్ ఉన్నాయి. మీరు ఏ రకమైన గేర్ ట్రాన్స్మిషన్ కారుని కొనడం మంచిది అనే సమాచారాన్ని చూద్దాం...
మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్
మాన్యువల్ గేర్ కార్లు భారతదేశంలో చాలా కాలంగా ప్రబలంగా ఉన్నాయి. ఈ కార్లను నడపాలంటే పెద్దగా అవగాహన అవసరం లేదు. అలాగే, వాటిని ఆపరేట్ అండ్ మైంటైన్ చాలా ఈజీ. అంతే కాకుండా మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ కార్ల ధర కూడా ఇతర కార్ల కంటే చాలా తక్కువ.
ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో కార్లను నడపడం చాలా సౌకర్యంగా ఉంటుందని మీకు తెలుసా. ఈ కార్లలో గేర్లు, క్లచ్‌లు మాన్యువల్‌గా ఉపయోగించలేము. ఈ కారణంగా కొత్త డ్రైవర్లు లేదా కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వారు కూడా ఈ కార్లను చాలా ఈజీగా నడపగలరు.