కార్ టిప్స్: మంచి మైలేజ్ కోసం కార్ నడుపుతున్నప్పుడు ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి..

First Published Jul 1, 2021, 4:23 PM IST

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు  రికార్డు స్థాయికి చేరాయి  పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ .100 దాటేసింది. డీజిల్ ధర కూడా త్వరలో మూడు అంకెలకు చేరువలో ఉంది. దీంతో  ఖర్చులను తగ్గించుకోవడానికి సిఎన్‌జి  బెస్ట్ ఆప్షన్ గా మారడానికి ఇదే కారణం. సిఎన్‌జి వాహనాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాదు, టెక్నాలజి వాటిని గతంలో కంటే ఇప్పుడు సురక్షితంగా చేసింది.

సిఎన్‌జి కార్లు తక్కువ బూట్‌స్పేస్, పర్ఫర్మేన్స్ ఉన్నప్పటికీ బడ్జెట్ మీకు చాలా ముఖ్యం అయితే సిఎన్‌జి కారు కంటే మారేది బెస్ట్ ఆప్షన్ కాదు. కానీ సాధారణ ప్రజల మనస్సులో ఇప్పటికీ కొన్ని సందేహాలు ఉన్నాయి. ఉదాహరణకు వేసవిలో సిఎన్‌జి వాహనాన్ని ఎలా నిర్వహించాలీ ? ఢీల్లీ వంటి వాయు కాలుష్య ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న హీట్ వేవ్ పరిస్థితులలో వాహనం లోపల సిలిండర్ ఉంచడం ప్రమాదకరమా ? అసలు సిఎన్‌జి కారును ఎలా నిర్వహించాలీ..?సిఎన్‌జి వాహనాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచడానికి 5 చిట్కాలను గుర్తుంచుకోండి....
undefined
టిప్ 1నాన్-సిఎన్‌జి వాహనాలలాగా సాధ్యమైనంతవరకు సిఎన్‌జి వాహనాన్ని నీడలో ఉంచడం ముఖ్యం. దేశంలోని అనేక ప్రాంతాల్లో జూలై నెలలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండటంతో ఎండ వేడి కారు క్యాబిన్ ఉష్ణోగ్రతను మరింత పెంచుతుంది. ఇలాంటి పరిస్థితిలో కారును ఎండలో ఎక్కువ సేపు ఆపి ఉంచడం కంటే దానిని నీడ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయడం మంచిది.
undefined
టిప్ 2కారులో సిలిండర్ల గరిష్ట పరిమితికి మించి సిఎన్‌జి నింపకుండా ఉండటానికి ప్రయత్నించండి. వేడి వాతావరణంలో ఉష్ణ విస్తరణ కారణంగా ఇది మంచిది. ఉదాహరణకు కార్ సిలిండర్‌కు ఎనిమిది లీటర్ల రీఫిల్ సామర్థ్యం ఉంటే, సిఎన్‌జి నింపేటప్పుడు ఏడు లీటర్లను మాత్రమే నింపమని గ్యాస్ స్టేషన్లో చెప్పండి. ఇంకా సిఎన్‌జి అయిపోతే భాధపడకండి.. ఎందుకంటే మీకు సి‌ఎన్‌జి కార్లలో పెట్రోల్‌ ఆప్షన్ కూడా ఉంటుంది.
undefined
టిప్ -3సిఎన్‌జి సిలిండర్‌ ఎక్స్పైరీ తేదీని చెక్ చేస్తుండటం గుర్తుంచుకోండి. సాధారణంగా ఒక సిలిండర్‌ లైఫ్ సుమారు 15 సంవత్సరాలు ఉంటుంది. అంటే కారు లైఫ్ కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందుకని పట్టించుకోకుండా ఉండటం కంటే సురక్షితంగా ఉండటం మంచిది.
undefined
టిప్-4సిఎన్‌జి సిలిండర్‌కి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి హైడ్రో-టెస్టింగ్ అవసరం. సిలిండర్‌కు లీకేజీ, డ్యామేజ్ టెస్టింగ్ ద్వారా తెలుస్తుంది.
undefined
టిప్-5మీ కారుకి లోకల్ మెకానిక్ ద్వారా సిఎన్‌జి కిట్ ఫిక్స్ చేసి ఉంటే స్టాండర్డ్ అండ్ సర్టిఫై కోసం చెక్ చేయడం మంచిది. వాహన తయారీ సంస్థలు ఇప్పుడు కంపెనీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌లను అందిస్తున్నాయి, దీనికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ కొత్త వాహనం వారంటీని ప్రభావితం చేయదు ఇంకా ఎక్కువ సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
undefined
click me!