మీ కార్ మైలేజీ తగ్గిందా.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే మైలేజ్ 20 శాతం పెరుగుతుంది..

Ashok Kumar | our own | Published : Jun 28, 2021 7:58 PM
Google News Follow Us

 దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే లీటరుకు రికార్డు స్థాయికి పెరిగింది. డీజిల్ ధర కూడా త్వరలో రూ.100  దాటనుంది. బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, లడఖ్‌లలో పెట్రోల్  ధర లీటరుకు రూ .100 దాటిన సంగతి మీకు తెలిసిందే.  

15
మీ కార్ మైలేజీ తగ్గిందా.. అయితే ఈ  చిట్కాలు పాటిస్తే మైలేజ్ 20 శాతం పెరుగుతుంది..

మీకు సొంత కారు ఉండి, మైలేజ్ సమస్యలు తరచుగా ఇబ్బందిగా అనిపిస్తున్నయా... స్టయిల్, లుక్కింగ్  కోసం  ప్రజలు వారి కారుకి  కొత్త కొత్త  మాడిఫికేషన్స్ తో  ప్రయోగాలు చేస్తుంటారు, ఇది కారు మైలేజీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.అయితే  కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం  ద్వారా మీరు మీ కారు మైలేజీని 20 శాతం వరకు పెంచవచ్చు.

25

కార్ బంపర్ క్రాష్ గార్డ్
కారుకి స్టయిలిష్ లేదా లుక్కింగ్ కోసం  బంపర్ క్రాష్ గార్డ్  అసెసోరిఎస్  బిగిస్తుంటారు. దీని వల్ల కారు మైలేజీ  దెబ్బతింటుంది. కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు కారు ముందు భాగంలో  బంపర్ క్రాష్ గ్రిల్ ను ఏర్పాటు చేస్తారు. కారుకి బంపర్ క్రాష్ గార్డ్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఎయిర్ బ్యాగ్ తెరవకపోవడంతో సహా అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కారు  మైలేజ్ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇంకా కారు ప్రమాదం జరిగినప్పుడు కారు  ఎయిర్‌బ్యాగులు తెరవకుండ మీ భద్రతకి అడ్డు పడుతుంది.
 
35

కస్టమైజ్  టైర్లు
ప్రజలు  కారుతో వచ్చిన టైర్లకు బదులు ఫ్యాషన్ కస్టమైజ్ వైడ్ టైర్లను బిగిస్తుంటారు. దీని వల్ల కారు పట్టును పెంచుతుంది, కాని  కారు ఇంజిన్‌పై ఒత్తిడిని మరింత పెరుగుతుంది. దీని కారణంగా కారు  మైలేజ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. సాధారణంగా ప్రజలు కంపెనీ అమర్చిన టైర్లను ఉపయోగిస్తారు, అవి తక్కువ వెడల్పు ఉంటాయి. వాటి బరువు కూడా కస్టమైజ్ టైర్ల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఇంజిన్‌పై చాలా తక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి.
 
Related Articles

45

 స్పాయిలర్స్
మీరు సాధారణంగా స్పాయిలర్లను స్పోర్ట్స్ కార్లలో మాత్రమే చూస్తారు. ఇవి కారు స్థిరంగా ఉండేలా చేస్తాయి, తద్వారా  రోడ్డుపై లేదా అధిక వేగంతో ఊన్నప్పుడు కూడా బ్యాలెన్స్ గా ఉంటాయి. మీరు సాధారణ కార్లలో స్పాయిలర్‌ను ఉపయోగిస్తే కారు ఏరోడైనమిక్ డిజైన్‌ను ప్రభావితం చేస్తుంది, ఈ కారణంగా కారు పికప్, ఇంజిన్ పై ఎక్కువ ఒత్తిడి  పడుతుంది. ఇంకా కారు మైలేజీని తగ్గిస్తుంది. అందువల్ల, మీరు మీ కారుకి స్పాయిలర్‌ ఇన్‌స్టాల్ చేసి ఉంటే దాన్ని వెంటనే తొలగించండీ. 
 
55

హెవీ రూఫ్ రైల్స్
మీరు ఎస్‌యూవీ వాహనాల్లో భారీ పైకప్పు రైల్స్ చూస్తుంటారు. దూర ప్రయాణం చేసేటప్పుడు వీటిపై చాలా లగేజ్ లోడ్ చేయవచ్చు. అయితే ప్రజలు ఇప్పుడు వాటిని మార్కెట్ నుండి కొనుగోలు చేయడం ద్వారా చిన్న కార్లకి  ఫిట్ చేస్తుంటారు. దీని వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది, ఇంకా మైలేజీని గణనీయంగా తగ్గిస్తుంది. చిన్న కార్లలో హెవీ రూఫ్ రైల్స్  బిగించకూడదు.

Recommended Photos