కొత్త వాహనాలు టెస్టింగ్ కోసం హై-స్పీడ్ ట్రాక్.. వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేసిన కేంద్ర మంత్రి

First Published | Jun 30, 2021, 12:25 PM IST

వర్చువల్ ఈవెంట్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆటోమోటివ్ టెస్టింగ్ కోసం ఆసియాలో పొడవైన హైస్పీడ్ ట్రాక్‌ను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ హై-స్పీడ్ ట్రాక్  పొడవు 11.3 కి.మీ. అంతేకాదు ఇది ఆసియాలో అతి పొడవైన హై-స్పీడ్ ట్రాక్ అలాగే ప్రపంచంలో ఐదవ పొడవైన ట్రాక్. 

ఇండోర్‌లోని పితాంపూర్ నగరంలో నిర్మించిన ఈ హై-స్పీడ్ ట్రాక్‌ను ఆటోమొబైల్ కంపెనీలు ఆటోమోటివ్ అండ్ కాంపోనెంట్ టెస్టింగ్ కోసం ఉపయోగిస్తాయి.నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ (నాట్రాక్స్ ) సౌకర్యం హై-ఎండ్ కార్లు, ఇతర వాహనాల టాప్ స్పీడ్ ని కొలుస్తుంది. ఇక్కడ ఉన్న నాలుగు లేన్ల ట్రాక్ అన్ని రకాల వాహనాల అభివృద్ధి, హోమోలోగేషన్ టెస్టింగ్ కోసం ఉపయోగించబడుతుంది.
హై-స్పీడ్ టెస్ట్ ట్రాక్ పొడవుకొత్త హై-స్పీడ్ టెస్ట్ ట్రాక్ 16 మీటర్ల వెడల్పు, ఓవల్ ఆకారంలో ఉంటుంది. ఇండోర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సౌకర్యం సుమారు 2,960 ఎకరాల భూమిలో అభివృద్ధి చేసారు. 250 కిలోమీటర్ల న్యూట్రల్ స్పీడ్, 375 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కోసం దీనిని రూపొందించారు.

చాలా రకాల టెస్టులు చేయవచ్చుటెస్టింగ్ ట్రాక్ పరిపూర్ణ పరిమాణం ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు (OEM) ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఒకే రకమైన ట్రాక్‌లో వివిధ రకాల ఆటోమోటివ్ టెస్టింగులు చేయవచ్చు. కోస్ట్ డౌన్ టెస్ట్, బ్రేక్ టెస్ట్, స్పీడోమీటర్ కాలిబ్రేషన్, స్థిరమైన స్పీడ్ ఇంధన వినియోగ టెస్ట్, సౌండ్ టెస్ట్, వైబ్రేషన్ కొలత, మైలేజ్ టెస్ట్ వంటి అనేక ఇతర టెస్టులు చేయవచ్చు.
14 ట్రాక్‌లునాట్రాక్స్ అత్యాధునిక టెస్టింగ్ పరికరాలతో 14 రకాల టెస్టింగ్ ట్రాక్‌లను అందిస్తుంది. ఈ ట్రాక్‌లలో కొన్ని బ్రేకింగ్ ట్రాక్, హ్యాండ్లింగ్ ట్రాక్, ఫెటీగ్ ట్రాక్, కంఫర్ట్ ట్రాక్, గ్రేడియంట్ ట్రాక్, సస్టైనబిలిటీ ట్రాక్ మొదలైనవి ఉన్నాయి. ద్విచక్ర వాహనాల నుండి భారీ వాణిజ్య ట్రక్కుల వరకు అన్ని రకాల వాహనాల మూల్యాంకన టెస్టింగ్ కోసం ఆర్ అండ్ డి లబొరేటరీస్, వర్క్‌షాప్‌లు ఉన్నాయి.

Latest Videos

click me!