చైనా అధ్యక్షుడి కారు గురించి తెలుసా.. ఒకటి కాదు రెండు కాదు.. మరి ఇంత సీక్రెట్గా నా...

First Published | Nov 17, 2023, 4:31 PM IST

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నారు. అయితే గత ఆరేళ్లలో ఇదే అతని మొదటి పర్యటన. జిన్‌పింగ్ చివరిసారిగా 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు.  

ఈసారి, అతను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశాలు నిర్వహించారు.  అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కి ది బీస్ట్ కారు ఉంటే, చైనా  అధ్యక్షుడు జిన్‌పింగ్ అత్యంత సీక్రెట్ కార్ N701ని చూపించడంలో వెనుకంజ వేయలేదు.

N701 అనేది Armored Hongqi N701 Limo కారుకి కోడ్ నేమ్, ఈ కారు జిన్‌పింగ్ అధికారిక కారు. ఈ కార్  70 ఏళ్ల చైనీస్ సుప్రీం లిడార్  అధికారిక సందర్శన కోసం సముద్రం మీదుగా అమెరికాకు తీసుకొచ్చారు.
 

అమెరికా అండ్  భారత ప్రధాని కార్లు:
భద్రతా కారణాల దృష్ట్యా, దేశాధినేతల అధికారిక వాహనాలకు సంబంధించిన చాలా వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. కానీ ఇప్పటికీ, కొన్ని వివరాలు పబ్లిక్‌గా మారాయి. జో బిడెన్ $1.5 మిలియన్ల కాడిలాక్ వన్ లిమౌసిన్ (Cadillac One Limousine) స్టేజ్‌కోచ్ సుమారు  20,000 పౌండ్ల బరువు ఉంటుంది, దీనిలో ఏడుగురు కూర్చోవచ్చు  ఇంకా  ఐదు అంగుళాల మందపాటి గ్లాస్ విండోస్  ఉంటాయి, ఈ కారు బుల్లెట్ అండ్ గ్రెనేడ్ ప్రూఫ్ బాడీతో ఉంటుంది.
 


 భారత ప్రధాని నరేంద్ర మోడీకి మెర్సిడెస్ మేబ్యాక్ S650 (Mercedes Maybach S650) 6-లీటర్ ట్విన్ టర్బో V12 ఇంజన్‌ కారుని కేటాయించారు.   ఈ కారుకి బుల్లెట్లు, బాంబులు, షార్ట్-త్రో మిస్సైల్స్ నుండి ఆర్మర్  ప్రొటెక్షన్   ఉంది. కానీ Hongqi N701 లిమోసిన్ గురించిన వివరాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి.
 

జిన్‌పింగ్ కారు ఫీచర్లు ఏంటి అంటే..
హాంగ్‌కీ(Hongqi) ఎన్701 లిమోసిన్ పొడవు దాదాపు 18 అడుగులు, 21 అంగుళాల మందపాటి వీల్స్ పై నడుస్తుందని చైనా మీడియా నివేదికలు తెలిపాయి. ఈ వీల్స్ బుల్లెట్ ప్రూఫ్ ఇంకా వాహనం చుట్టూ ఉన్న గ్లాస్ కూడా బుల్లెట్ ప్రూఫ్. బయటి భాగం ఆర్మర్ తో  కవర్ చేసి ఉంటుంది.  కెమికల్స్  దాడుల నుండి రక్షించే ఎయిర్ కంప్రెషన్ సిస్టమ్‌ను కూడా ఉంది. ఈ వాహనం 408 hp శక్తిని ఉత్పత్తి చేసే 6-లీటర్ V12 ఇంజిన్‌ పొందుతుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

లుక్స్ అండ్ డిజైన్
చైనా FAW గ్రూప్ యాజమాన్యంలోని బ్రాండ్ Hongqi ద్వారా ప్రత్యేకంగా ఈ కారుని తయారు చేయబడింది, ఈ కారుకి  స్ట్రాంగ్  రోడ్  ప్రసేన్స్  ఉంది. అంత స్టైలిష్ గా కనిపించకపోయినా Hongqi N701 లిమౌసిన్ పెద్ద గ్రిల్‌తో బ్లాక్ సాలిడ్ ఫ్రంట్ ఫాసియా  పొందింది. LED లైట్లు సింపుల్ అండ్  విండో చుట్టూ కొద్దిగా అడిషనల్ క్రోమ్ ఉంటుంది.

Latest Videos

click me!