అమ్మకాల క్షీణత చాలా తీవ్రంగా ఉంది, PAMA రికార్డులు 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కేవలం 27,163 యూనిట్లు విక్రయించబడ్డాయి. అంతకు ముందు కాలంలో ఇదే నెలల్లో 48,573 యూనిట్ల నుంచి 44 శాతం భారీ క్షీణత నమోదైంది.
పాకిస్తాన్ కార్ మార్కెట్‌లో ప్రస్తుతం అట్లాస్ హోండా, పాక్ సుజుకి, టయోటా, హ్యుందాయ్ అండ్ కియా వంటి కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కానీ ఇక్కడ స్థానికంగా తయారీ లేదు. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలతో పాటు వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా నెల నెలా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో బైక్స్ విక్రయాలు 10 శాతం క్షీణించాయి. ప్రజలకి కొనుగోలు శక్తి లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంటే పాకిస్తాన్ ప్రజల వద్ద వాహనాలు కొనడానికి సరిపడా డబ్బు లేదు అని సూచిస్తుంది.