ఈ కారుని కొంటున్నారా.. అయితే వేరొకరికి అమ్మితే భారీ జరిమానా.. అదేంటో తెలుసుకోండి..

First Published | Nov 15, 2023, 4:20 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో టెస్లా సైబర్‌ట్రక్ ఒకటి. సమూలంగా రూపొందించబడిన ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ గతంలో ఒక కాన్సెప్ట్‌గా పరిచయం చేసారు. ఇక అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది.

అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాన్నీ బుక్ చేసుకున్న లక్షలాది మందికి ఈ  ట్రక్ డెలివరీ ఇంకా చేరుకోలేదు. అయితే, టెస్లా ఇప్పుడు నవంబర్ 30న సైబర్‌ట్రక్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

ఈ ఏడాది నవంబరు 30న టెస్లా సైబర్‌ట్రక్‌ని లాంచ్ చేయడానికి ముందు,  కంపెనీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ అమ్మకపు నిబంధనలను వెల్లడించింది. టెస్లా సైబర్‌ట్రక్‌ను   కొనే కస్టమర్లు  మొదటి సంవత్సరంలో దానిని వేరొకరికి అమ్మలేరు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వాహనం  కోసం వాహన కంపెనీ సేల్ నిబంధనలు అలా చెబుతున్నాయి. ఒక కస్టమర్ టెస్లా సైబర్‌ట్రక్‌ను కొన్న మొదటి సంవత్సరంలోని మరొకరికి అమ్మినట్లయితే  అతను కార్ కంపెనీకి  $ 50,000 (సుమారు రూ. 41.5 లక్షలు)ల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిని ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
 

ఈ రూల్ కంపెనీ నుండి ప్రత్యేకమైన నిబంధనగా వస్తుంది. ఎందుకంటే బంపర్ డిమాండ్ ఉన్న వాహనం కోసం మరే ఇతర వాహన తయారీదారులు  కస్టమర్‌లతో ఇలాంటి  నిబంధన సెట్ చేయలేదు. అయినప్పటికీ విదేశీ కార్ల పరిమిత ఉత్పత్తికి ఇటువంటి ఒప్పందాలు సాధారణంగా ఉంటాయి.


టెస్లా సైబర్‌ట్రక్ కస్టమర్‌లు పికప్ ట్రక్కును కొనేటప్పుడు తప్పనిసరిగా సేల్ డీల్ పై సంతకం చేయాలి. ఎలక్ట్రిక్ ట్రక్కును డెలివరీ తీసుకున్న తర్వాత కనీసం ఒక సంవత్సరం పాటు తిరిగి మరొకరికి అమ్మకూడదని  కొనేవారు  అంగీకరిస్తున్నట్లు ఈ ఒప్పందం పేర్కొంది. అయితే కొన్ని పరిస్థితులలో టెస్లా సైబర్‌ట్రక్  రిసేల్  అంగీకరిస్తుంది. కానీ అతనికి  రిజెక్ట్ చేసే  మొదటి హక్కు ఉంటుంది. అయితే ఆ పరిస్థితులు ఏమిటో వాహన కంపెనీ  లిస్ట్ చేయలేదు.

మొదటి సంవత్సరంలో సైబర్‌ట్రక్‌ను రిసేల్ చేసినందుకు లేదా అమ్మినందుకు పరిగణనలోకి తీసుకున్న విలువ, ఏది ఎక్కువైతే ఆ   మొత్తాన్ని రిసెల్లర్  నుండి డిమాండ్ చేయవచ్చని ఎలక్ట్రిక్ కార్ కంపెనీ హెచ్చరించింది.

మరో విషయం  ఏంటంటే  EV కంపెనీ సైబర్‌ట్రక్ కొని రిసేల్ చేసినందుకు కంపెనీ నుండి భవిష్యత్తులో వాహనాలను కొనలేకుండా నిరోధించవచ్చని టెస్లా కస్టమర్లను  హెచ్చరించింది.

Latest Videos

click me!